Breaking News

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక కాశీ విశ్వనాథ్ ధామ్ : గవర్నర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రతీకగా నిలుస్తుందని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడి సోమవారం ఈ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేసిన నేపథ్యంలో గవర్నర్ మాట్లాడుతూ అద్భుతమైన కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్ట్ భారతీయుల సాంస్కృతిక చిహ్నంగా నిలుస్తుందన్నారు. దేశీయ నాగరికతకు గుర్తింపును తెస్తుందన్నారు. దివ్య కాశీ భవ్య కాశీ ప్రాజెక్ట్ నేత్ర పర్వంగా దర్శనమిస్తూ అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని గౌరవ గవర్నర్ బిశ్వభూషన్ హారిచందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం

-రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి వ్యాఖ్య అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ కేంద్రంగా దక్షిణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *