అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తాజాగా ఏపీలో సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవో జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్, సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజా తదితరులు ఏపీ సియం వైయస్ జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దర్శకధీరుడు రాజమౌళి కూడా స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘ఏపీ సియం కు ధన్యవాదాలు.. వైయస్ జగన్ గారు, పేర్నినానిగారు కొత్త జీవోలో సవరించిన టికెట్ ధరల ద్వారా చలన చిత్ర రంగానికి ఎంతగానో సహాయపడ్డారు. ఇది సినిమాల పునరుద్ధరణకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను’.. అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. తాజా జీవో ఆ సినిమా కలెక్షన్స్ పై మంచి ప్రభావం చూపిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
Tags amaravathi
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …