Breaking News

ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలి…

-జగనన్న ఇళ్ల కాలనీలలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు
-పేదలందరికీ ఇళ్ల పధకంలో ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి: జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్

గుడివాడ , నేటి పత్రిక ప్రజావార్త :
పేదలందరికీ ఇళ్ళు పధకంలో ఇళ్ల నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలనీ జాయింట్ కలెక్టర్ (హౌసింగ్ )నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పనుల ప్రగతిపై స్థానిక ఎన్టీఆర్ ఇన్డోర్ స్టేడియం మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ (అసరా) కె. మోహన్ కుమార్ తో కలిసి రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ, సంబంధిత శాఖల అధికారులతో మంగళవారం జాయింట్ కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నుపూర్ శ్రీవాస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాల కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్ల పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నదన్నారు. ఇళ్ల నిర్మాణానికి ఇది సరైన సమయమని , సంబంధిత శాఖల అధికారులందరూ జగనన్న ఇళ్ల పథకంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని, నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. పేదలందరికీ ఇళ్ళు పధకంలోని ప్రతీ లబ్ధిదారుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న ఇళ్ల లేఔట్ లలో నిర్మాణ మెటీరియల్ నిర్మాణ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా రోడ్లు నిర్మించాలన్నారు. ఆంతేకాక విద్యుత్, నీటి సౌకర్యం వంటి మౌలిక సదుపాయాలు కపించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. డ్వాక్రా మహిళా లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అదనపు రుణాలు మంజూరు చేయడం జరిగిందని, రుణాలు తీసుకున్న లబ్దిదారులందరూ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఉచిత ఇసుక, సబ్సిడీపై అందిస్తున్న సిమెంట్, ఐరన్ వంటి నిర్మాణ సామాగ్రి ఎటువంటి జాప్యం లేకుండా లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి సంబందించిన బిల్లుల చెలింపులు నిర్ణీత సమయంలోగా చెలించేందుకు గృహ నిర్మాణ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రెవిన్యూ డివిజినల్ అధికారి జీ. శ్రీను కుమార్, హౌసింగ్ ఈ ఈ శ్రీదేవి, తహసీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *