తణుకు, నేటి పత్రిక ప్రజావార్త :
మంచిలి- అత్తిలి, అత్తిలి-రేలంగి , అత్తిలి- తణుకు మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా రైల్వే గేట్లు 138, 140, 150 లని మార్చి 17 నుంచి 19 వరకు నిర్ణిత రాత్రి సమయాల్లో గేట్లు మూసి ఉంచడం జరుగుతుందని రైల్వే భద్రతా అధికారి వి. నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. మంచిలి-అత్తిలి మధ్య ఉన్న రైల్వే గేట్ 138 మార్చి 16 వ తేదీ రాత్రి 10 నుంచి మార్చి 17 వ తేదీ ఉదయం 6 గంటల వరకుమూసి ఉంచుతున్న దృష్ట్యా అత్తిలి, మంచిలి ఆచంట గ్రామ ప్రజలు గమనించవలసి నదిగా కోరియున్నారు. అత్తిలి- రేలంగి రహదారి లో ఉన్న రైల్వే గేట్ 140 రైల్వే గేట్ మార్చి 17 వ తేదీ రాత్రి 10 నుంచి మార్చి 18 వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచడం వలన ఆ మార్గంలో ప్రయాణించి అత్తిలి, రేలంగి, పాలి, ఇరగవరం గ్రామ ప్రజలు గమనించ వలసినదిగా కోరియున్నారు. అత్తిలి – తణుకు మధ్య ఉన్న రైల్వే గేట్ 150 మార్చి 18 వ తేదీ రాత్రి 10 నుంచి మార్చి 19 వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచడం మూసి ఉంచడం వలన ఆ మార్గంలో ప్రయాణించి వేల్పూరు, పైడిపాక, మండపాక గ్రామ ప్రజలు గమనించ వలసినదిగా నాగేశ్వరరావు కోరియున్నారు. పై పేర్కొన్న ఆయా లెవెల్ క్రాసింగ్ రహదారి మార్గాలు ద్వారా ప్రయాణించే సంబంధించిన గ్రామాలకు చెందిన ప్రజలు, ఆయా గ్రామాల మీదుగా వెళ్లే వాహనాలు, తదితరులు రాత్రి సమయాల్లో మళ్లింపు మార్గాలు ద్వారా ప్రత్యన్మయ మార్గాల్లో ప్రయాణాలు చేయవలసిందిగా కోరియున్నారు.
Tags thanuku
Check Also
ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ …