గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ వారిచే గుంటూరు వస్త్ర నగర్ నందివెలుగు రోడ్డు లో ప్రతిష్ట చేయబడిన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత కామ్య సిద్ధి వెంకటాచల స్వామి దేవస్థానంలో గత ఐదు రోజులుగా వైభవోపేతంగా జరుగుతున్న సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రంతో ఘనంగా ముగిసాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, కార్యదర్శి ఎం.వి. శేషగిరిరావు, కోశాధికారి మద్దినేని నాగేశ్వరరావు, ఇతర పాలకవర్గ సభ్యులు ఈ ఉత్సవాలను పర్యవేక్షించారు. నిత్యం వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ముగింపు రోజున అన్నదాన కార్యక్రమం జరిగింది.
Tags guntur
Check Also
ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కృషి
-ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం,మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో …