సెంట్రల్లో 3 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి రూ. కోటి 83 లక్షలు మంజూరు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-వైఎస్సార్ సీపీ పాలనలోనే ఆలయాలకు పూర్వవైభవం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా ఆలయాల అభివృద్ధికి విశేషంగా నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ సెంట్రల్ నియోజకవర్గంలోని మూడు ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధికి రూ. కోటి 83 లక్షలు మంజూరైనట్లు ఓ ప్రకటనలో తెలిపారు. సత్యనారాయణపురంలోని శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి రూ. 70 లక్షలు., గవర్నర్ పేటలోని శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ దేవస్థానానికి రూ. 95 లక్షలు., తుమ్మలపల్లి కళాక్షేత్రం వెనుక భాగాన ఉన్న శ్రీ వీరబాబు స్వామి ఆలయానికి రూ. 18 లక్షలు మంజూరైనట్లు వివరించారు. గత ఆర్ధిక సంవత్సరంలోనూ శ్రీ వీరబాబు స్వామి ఆలయ పునః నిర్మాణానికి రూ. 13 లక్షలు., సింగ్ నగర్ లోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ. 15 లక్షలు మంజూరు అయినట్లు వెల్లడించారు. ఈ నిధులతో ఆయా దేవాలయాలలో ముఖద్వారాలు, యాగశాలలు, అభిషేక మండపాలు, వ్రత మండపాలు, యజ్ఞ మండపాలు, ఆఫీస్ కార్యాలయాల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి ఆలయంలోనూ గోశాల ఉండేలా చూస్తామని ఉద్ఘాటించారు. అలాగే దేవాలయాలకు వచ్చే భక్తులకు వసతి సదుపాయాల కల్పనలోనూ ఎక్కడా రాజీ పడకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాలలో స్పష్టం చేశారని మల్లాది విష్ణు తెలిపారు.

గతంలో దేవాలయాలను కూల్చిన ప్రభుత్వాలను చూశామని.. చంద్రబాబు హయాంలో ఒక్క విజయవాడ నగరంలోనే 40 దేవాలయాలను కూలగొట్టారని మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ దేవాలయాలను పునర్నిర్మించడమే కాకుండా అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. గత పాలకులు చారిత్రాత్మక ఆలయాలను సైతం పూర్తిగా విస్మరించారని, ఫలితంగా ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాలు శిథిలావస్థకు చేరాయన్నారు. ఆలయాల చరిత్ర భవిష్యత్ తరాలకు అందించడం కోసమే ఈ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై దృష్టిసారించిందన్నారు. దీంతో దేవాలయాలన్నీ ధూపదీప నైవేద్యాలతో, నిత్య కైంకర్యాలతో కళకళలాడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కార్యక్రమాలతో ప్రజలలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడుతూ, దేవాలయాల వ్యవస్థను ఎల్లవేళలా పరిరక్షిస్తూ ముందుకు సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని దేవుళ్ల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *