విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు అనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలను తుమ్మలపల్లి కళా క్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ తెలిపారు. సోమవారం విధ్యధరపురంలోని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులు శాఖ సర్విసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వాణిజ్యపన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ (గతంలో వాణిజ్యపన్నుల శాఖ ఎన్.జి.ఓ.ల సంఘం) ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భంగా రేపు అనగా ఈ నెల 6 వ తేదీన స్వర్ణోత్సవ సభ జరుపుకుంటుందని తెలిపారు. 1972 లో ప్రారంభమయిన ఈ సంఘ ప్రస్థానం ఉద్యోగుల ప్రయోజనాలకు భరోసానిచ్చిందని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్యపన్నులశాఖలోని అన్ని కేడర్ ఉద్యోగులతో కూడిన ఈ సంఘం గత 5 దశాబ్దాలుగా నిర్మాణాత్మక పాత్రను పోషిస్తూ, అటు ప్రభుత్వానికి, ఇటు ఉద్యోగులకు వారధిగా నిలిచిందన్నారు. జి.ఎస్.టి. అమలు పేరుతో రాష్ట్రాల ఆర్థిక హక్కులను హరించే విధంగా ఉన్న ప్రతిపాదనలను ఈ సంఘం మొదటి నుండి ప్రతిఘటించి రాష్ట్రాల హక్కులను కాపాడడంలో విశేషమైన కృషి చేసిందన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యమించడమే కాకుండా , వారి బాధ్యతలను కూడా గుర్తుచేస్తూ ఈ సంఘం సానుకూల దృక్పధంతో వ్యవహరిస్తూ వచ్చిందన్నారు. ఈ స్వర్ణోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ అమాత్యులు , ప్రభుత్వ సలహాదారులు మరియు ఉన్నతాధికారులు హాజరవుతున్నారని చెప్పారు. సుమారు 14 రాష్ట్రాల నుండి ఉన్నతాధికారులు ఈ సభకు ప్రతినిధులుగా హాజరవుతున్నారని ప్రథమ ప్రాధన్యంగా తామిళనాడును ఏంపిక చేసినట్లు తెలిపారు. జూన్ 2022 తో రాష్ట్ర ప్రభుత్వాలకు జి.ఎస్.టి. ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీచేయడం ఆపివేయడంతో, రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు రావచ్చని ఈ సమస్యపైన మరియు జి.ఎస్.టి. సంబంధించిన ఇతర అంశాలపైనా ఈ సభలో చర్చ జరగనుందని చెప్పారు. అంతేకాకుండా, జి.ఎస్.టి. చట్టానికి అనుగుణంగా రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖ పునర్ వ్యవస్థీకరణపైన కూడా ఈ సభలో చర్చించనున్నారు . రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి సుమారు 2000 మంది ఉద్యోగులు ఈ సభలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షులు కె.ఆర్.సూర్యనారాయణ అఖిలభారత సమాఖ్యకు కూడా జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యధర్శి రమేష్, కోశాధికారి జి.ఆర్.రమేష్ ఆసోసియోషన్ సభ్యులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …