Breaking News

గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది సంపూర్ణ పారిశుద్ద్య లక్ష్యంగా అధికారులు పని చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్ది సంపూర్ణ పారిశుద్ద్య లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. మంగళవారం ఉదయం విజయవాడ రూరల్‌ మండలం నిడమనూరు గ్రామంలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ లో భాగంగా స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ అమలు తీరును కలెక్టర్‌ డిల్లీరావు క్షేత స్థాయిలో పరిశీలించారు. నిడమనూరు గ్రామలలో అన్ని వీధులలో జరుగుతున్న పరిశుభ్రతను పరిశీలించారు.పారిశుద్ద్య సిబ్బంది తడి పొడి చెత్త సేకరించి వేరు చేసే విధానాన్ని పరిశీలించారు. గ్రామంలో మురుగునీరు పారుదల డ్రైనెజీ వ్యవస్థపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రైయినెజ్‌లలో ఎప్పటికప్పుడు పూడిక తీయాలన్నారు. మురుగునీరు ఎక్కడ నిల్వ ఉండకుండా సక్రమంగా పారేలా చూడాలన్నారు. నిడమానూరు గ్రామాన్ని మోడల్‌ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు తన పూర్తి సహకారం ఉంటుందన్నారు. గ్రామంలోని పూర్తి డ్రైనెజి వ్యవస్థపై ఒక మ్యాప్‌ ను రూపొందించి మురుగు నీరు ఎక్కడ నిల్వ ఉండకుండా సులువుగా పారేవిధంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త డంపింగ్‌ చేయరాదని స్థానికులకు కలెక్టర్‌ సూచించారు. తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలించాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ఘనవ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌
జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా నిడమానూరులో ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ ) కేంద్రాన్ని పరిశీలించి ప్రాసెస్‌ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. గ్రామాలో సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి ప్రాససింగ్‌ కేంద్రంలో వర్మి కంపోస్టు ఎరువు తయారు చేసి పంట భూములకు వినియోగించుకునేలా నిర్వహణ కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

గ్రామ సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌
నిడమనూరు గ్రామ సచివాలయంలో అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రజల నుండి అందిన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు సకాలంలో అందేలా చూడాలన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలతో గౌరవంగా వ్యవహరించి ప్రజలు అందించిన ఆర్జీలను మొదటి దశలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆదేశించారు. సచివాలయ సిబ్బంది హాజరు పట్టిక, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలు, వివిధ పథకాల కింద లబ్దిపొందుతున్న లబ్దిదారుల జాబితా ప్రదర్శన తీరును కలెక్టర్‌ పరిశీలించారు.

ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్‌
నిడమానూరులో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు వై.ఎన్‌.ఆర్‌ చారిటీస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రజలకు లాభాపేక్ష లేకుండా స్వచ్చందంగా ఉచిత మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల వై.ఎన్‌.ఆర్‌ చారిటీస్‌ కోఆర్డినేటర్‌ మధు బోస్‌బాబు, సంస్థ నిర్వహకులను కలెక్టర్‌ అభినందించారు.
కలెక్టర్‌ వెంట విజయవాడ రూరల్‌ యంపిడివో. జె.సునీత,గ్రామ సర్పంచ్‌ శీలం రంగారావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పిజిఆర్ఎస్ ఆర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కారానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *