
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం మసీద్-ఏ-రజా స్ట్రీట్ లో జనసేనా పార్టీ విజయవాడ నగర అధికార ప్రతినిధి, ఐజా గ్రూప్ చైర్మన్ షేక్ గయాజుద్దిన్ (ఐజా) ఆధ్వర్యంలో 4,000మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పశ్చిమ నియోజక వర్గానికి చెందిన 30 మసీదుల నుంచి ప్రజలు మరియు ముస్లిం పెద్దలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా నగర అధికార ప్రతినిధి షేక్ గయాజుద్దిన్ (ఐజా) మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు వాడుకొని వారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ని పూర్తిగా విస్మరించారని, ఎన్నికల్లోనే మైనార్టీలు గుర్తుంటారు కానీ ఎన్నికల తర్వాత వారిని పూర్తిగా మరచి పోతారని, రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలు మహేష్ కి అండగా నిలబడాలని తద్వారా నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమం వేగవంతం అవుతుందని ఆకాంక్షిస్తున్నాను అని తెలియజేశారు. రంజాన్ విందు ఇవ్వడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు. తమ ఐజాట్రస్టు ద్వారా సామాజిక సేవలను నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షతో ఉంటారని, వారందరికీ చక్కటి విందు ఇవ్వాలనే సత్సంకల్పంతో నేడు ఈ ఇఫ్తార్ విందు ను ఇస్తున్నట్లు చెప్పారు. నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విజయవాడ నగరంలోని మరి ఏ ఇతర పార్టీ ఏర్పాటు చేయని విధంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారని, ఈ విందులో మటన్ బిర్యానీ, రుమాల్ రోటీ, చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ పెట్టడం మామూలు విషయం కాదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ముస్లిం మైనార్టీల ద్రోహం చేశారని ఇంతవరకు ఈ మూడేళ్లలో పంజా సెంటర్ లో ముసాఫిర్ ఖానా ప్రారంభించ లేక పోయారని, ఉర్దూ కళాశాలను గాలికి వదిలేశారని, హజ్ హౌస్ నిర్మాణం ఇక్కడి నుండి తరలిపోయిన మౌనంగా ఉండి ముస్లిం ద్రోహం చేశారని, వెల్లంపల్లి శ్రీనివాస్ మిత్రులు స్థలాలను కబ్జా చేసిన కనీసం వారిపై చర్యలు తీసుకోలేదని, రంజాన్ లోపు ముసాఫిర్ ఖానాల కనుక ప్రారంభించక పోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు మల్లెపువిజయలక్ష్మి, తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు సాయి శరత్ ,కూరాకుల సురేష్, నల్లబెల్లి కనకారావు, సిగ్ననంశెట్టి రాము , నగర అధికార ప్రతినిధి సయ్యద్ నజీప్ ,జనసేన నాయకులు స్టాలిన్, భావి శెట్టి శ్రీను, కే ఎస్ ఎన్ మూర్తి, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News