Breaking News

జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావడం అభినందనీయం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హెచ్‌సిఎల్‌ టెక్నాలజీ పౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
గురువారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో హిందుస్థాన్‌ కంప్యూటర్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌పిఎల్‌) టెక్నాలజీ పౌండేషన్‌ అంకిత్‌ మరియు వినిత్‌ టీమ్‌ సభ్యులు, వాసవ్య మహిళ మండలి డా. కీర్తి జిల్లా కలెక్టర్‌ను కలిసారు.
ఈ సందర్భంగా హెచ్‌సిఎల్‌ పౌండేషన్‌ సభ్యులు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడుతూ విజయవాడ నగరంలోని చుట్టుపక్కల హరిత్‌ ప్రాజెక్టలో భాగంగా 10 ఎకరాల స్థలంలో పర్యావరణ అనుకూల అర్బన్‌ ఫారెస్టీ, ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు దీనిలో భాగంగా పచ్చని మొక్కలు, పక్షులతో ఆహ్లాదంగా తీర్చిదిద్దే విధంగా హరిత్‌ ప్రాజెక్టను చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. 5 నుంచి 10 సంవత్సరాలలోపు ఈ పాజెక్టును పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడం జరుగుతుందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు హెచ్‌సిఎల్‌ పౌండేషన్‌ సభ్యులకు తెలిపారు. కార్పొరేట్‌ సోషల్‌ రేస్పాన్స్‌బులిటీ (సిఎస్‌ఆర్‌)లో భాగంగా హెచ్‌సిఎల్‌ టెక్నాలజీ పౌండేషన్‌ కేసరిపల్లిలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని దీనిలో భాగంగా రెండు చెరువులను అభివృద్ధి చేయడం జరిగిందని, తద్వారా ఆ ప్రాంతంలో భూ గర్భజలమట్టాల స్థాయి పెరిగిందన్నారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.
హెచ్‌పిఎల్‌ టెక్నాలజీ పౌండేషన్‌ సంస్థ ద్వారా గత 5 సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యులై పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వీటిలో భాగంగా అర్భన్‌ హెల్త్‌ సెంటర్స్‌, అంగన్‌వాడీలలో పలు ఆరోగ్యకరమైన కార్యాక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. హోల్‌సెల్‌ రిటైల్‌ రంగంలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. మహిళలు, యువతకు కంప్యూటర్స్‌లో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతోపాటు ఉపకరణాలను కూడా అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *