గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో చేపట్టే రోడ్లు, నూతన ప్రాజెక్ట్ ల నిర్వహణా వ్యయం తగ్గించుకొని, మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళిక రూపొందించుకోవడానికి యునిడో సంస్థ సలహాలు ఉపయుక్తంగా ఉంటాయని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ చేపట్టే ప్రాజెక్ట్ ల ద్వారా మెరుగైన ఫలితాలు తెచ్చేందుకు పట్టణ ప్రణాళిక, అకౌంట్స్ మరియు ఇంజినీరింగ్ అధికారులకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (యునిడో), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు పర్యావరణ ప్రాజెక్ట్ ల ప్రణాళిక వర్క్ షాప్ ని నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. తొలుత కమిషనర్ చాంబర్ లో కమిషనర్ తో సదరు బృందం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ప్రజా అవసరాలకు అనేక ప్రాజెక్ట్ లు చేపడుతుందని, అందులో రోడ్లు, యు.జి.డి. నిర్వహణ, త్రాగునీటి సరఫరా, పారిశుద్యం ప్రధానమైనవన్నారు. యునిడో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు గురువారం, శుక్రవారాల్లో జరిగే 2 రోజుల వర్క్ షాప్ లో ఆయా పధకాల నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడం, మరియు సమర్ధ నిర్వహణకు తగు సూచనలు నగరపాలక సంస్థ అధికారులకు తెలియచేయాలని కోరారు. యునిడో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృందాలు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్ట్స్ లో విశేష అనుభవం కల్గి ఉంటారని, వారు సూచనలు నగర ప్రజలకు అత్యుత్తమ స్థాయి సేవలు అందించేందుకు దోహదపడుతాయన్నారు.
యునిడో, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ బృంద సభ్యులు మాట్లాడుతూ కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సహకారంతో యునిడో విజయవాడ, గుంటూరు, భోపాల్, మైసూర్, జైపూర్ ల్లో ప్రాజెక్ట్స్ మెరుగైన ఫలితాలు వచ్చేలా, అధికార, సిబ్బంది సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేలా తగిన సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. సుస్థిరత ప్రణాళిక అమలు, మునిసిపల్ వ్యర్థ పదార్థాల నిర్వహణను పరిష్కరించడానికి తక్కువ కార్బన్ పరిష్కారాలలో పెట్టుబడులు వ్యర్థాలు మరియు పారిశుధ్య రంగంలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు మరియు నిర్వహణ కోసం నగర అధికారుల సామర్థ్యం మరియు నైపుణ్యాలు పెంపుకు వర్క్ షాప్ లో ప్రతిపాదనలు తయారు చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ జానీస్ విట్టింగ్ టన్, క్యాలిఫ్లోర్నియా స్టేట్ పాల్ట్కినిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆడ్రీన్ గ్రీవ్, సుజాత శ్రీకుమార్, యునిడో ప్రాజెక్ట్ బృందం నుండి డాక్టర్ నందపాల్ సింగ్, మానస సురేష్, పి.వి.రమణారావు, నగరపాలక సంస్థ ఎస్.ఈ. డి.శ్రీనివాస్, సిటి ప్లానర్ మూర్తి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ నాగేంద్ర కుమార్, ఈ.ఈ.లు, డి.ఈ.ఈ.లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News