Breaking News

పేదలకు ఆపన్న హస్తం అందించడంలో దాతల సహకారం మరువలేనిది…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అందించి వారిని ఆదుకోవడంలో దాతల సహకారం మరువలేదని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
గొల్లపూడిలోని టిటిడిసి ఆవరణంలో శనివారం నెస్లే ఇండియా మరియు జూనియర్‌ ఛాంబర్‌ఆఫ్‌ ఇంటర్‌నేెషనల్‌ (జెసిఐ) సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బులిటీలో భాగంగా నిరుపేదలకు నిత్యావరస సరుకుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ అట్టడుగున జీవిస్తున్న నిరుపేద కుటుంబాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పధకాలను అందజేస్తుందన్నారు. వీటితో పాటు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. వ్యాపార రంగంలో స్థిరపడి సంపాదించిన దానిలో కొంత పేదలకు ఖర్చు చేయాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. నెస్లే సంస్థ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.
సెర్ప్‌ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఏ యండి ఇంతియాజ్‌ మాట్లాడుతూ సమాజంలో పేదలకు సేవ చేయాలనే భావన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. నిరుపేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆసరా ద్వారా పెన్షన్ల పంపిణీ, రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు, ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలను అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు స్వచ్ఛంద సంస్థల దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని ఆయన అన్నారు. నెస్లే ఇండియా నిత్యావసర వస్తువుల వితరణను చేపట్టి ఒక్కొక్కరికి సుమారు 1200 రూపాయలు విలువుగల నిత్యావసర సరుకులను 500 మంది పేదలకు పంపిణీ చేసిన్నట్లు ఇంతియాజ్‌ తెలిపారు.
కార్యక్రమంలో డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ యం.కిరణ్‌కుమార్‌, నెస్లే ఇండియా మేనేజర్‌ వసీం అహమ్మద్‌, జిసిఐ పౌండేషన్‌ డైరెక్టర్‌ ఎన్‌బి హర్షవర్థన్‌, ఏపి అధ్యక్షులు అనిరుద్‌ శిష్ట్లా, విజయవాడ పయనీర్స్‌ సభ్యులు చింతమనేని సాహీతి, యద్దనపూడి సతీష్‌కుమార్‌, అజయ్‌కుమార్‌, డా. నూరీపర్వీన్‌ అన్వర్‌, స్వయం సహాయక బృందాల సామైఖ్యజిల్లా అధ్యక్షురాలు శాఖమూరి కుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *