Breaking News

వరహాగిరి వెంకటగిరి యువతకు ఆదర్శనీయులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదర్శ ప్రజా ప్రతినిధిగా, స్వాతంత్ర్య పోరాట యోధునిగా భారత దేశ నాల్గవ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి యువతకు ఆదర్శనీయులని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) డి.శ్రీనివాసరావు అన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా బుధవారం కీర్తి చేకూరి ఐఏఎస్  ఆదేశాల మేరకు వరాహ గిరి వెంకటగిరి జయంతి సందర్భంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భముగా అదనపు కమిషనరు మాట్లాడుతూ వరహాగిరి వెంకటగిరి గారు ప్రజా ప్రతినిధిగానే కాకుండా కార్మిక నాయకునిగా వారి సమస్యల పరిష్కారానికి అలుపెరగని కృషి చేశారన్నారు. క్విట్ ఇండియా ఉధ్యమంలో పాల్గొని జైలు జీవితం కూడా గడిపారన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడి, స్వాతంత్ర్యం అనంతరం ఆదర్శ ప్రజా ప్రతినిదిగా, రాష్ట్రపతిగా ఆయన దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 1 నుండి 15వ తేది వరకు జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా బృందావన్ గార్డెన్స్ ఎన్.టి.ఆర్.మున్సిపల్ స్టేడియంలో 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఫ్యాన్సీ డ్రస్ పోటీలు (స్వాతంత్ర్య పోరాట యోధుల వేష దారణ), 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు మ్యూజికల్ పోటీలు (దేశభక్తీ గేయాలు), 13వ తేదీ ఉదయం ఫోటోగ్రఫి, క్యాన్వాస్ ప్రదర్శన, సాయంత్రం 4 గంటలకు డ్యాన్స్ పోటీలు (జాతీయతను పెంపొందించేవి), 14వ తేదీ ఉదయం 6 గంటలకు సైకిల్ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. నేటి యువత మరియు విద్యార్ధులకు నాటి స్వాతంత్ర్య పోరాట చరిత్ర, త్యాగాలను తెలియచేయడానికి చేపట్టే కార్యక్రమాల్లో నగర పజలు, విద్యార్ధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమములో డిప్యూటీ కమీషనర్లు బి.శ్రీనివాసరావు. టి.వెంకట కృష్ణయ్య, సి.ఎం.ఓ.హెచ్. డాక్టర్ విజయలక్ష్మీ, వివిధ విభాగాల సూపరిండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గోనినారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *