విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
75వ,స్వాతంత్రదినోత్సవం సందర్బంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టి. డి. పి. నాయకులు ఎమ్ ఎస్ బేగ్ ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజనులో ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత వించిపేటలో మాజీ మంత్రి ఎమ్ కే బేగ్ కార్యాలయంలో దేశ నేతల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరించారు. గాంధీ భోమ్మ సెంటర్ లో ఎస్ కే అసిఫ్ ఖాన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు పండ్లు పంపిణి కార్యక్రమంలో ఎమ్ ఎస్ బేగ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఏస్ కే తాజ్జుదిన్, ఆధ్వర్యంలో పంజా సెంటర్ నందు జెండా ఆవిష్కరణ ,మరియు పండ్లు పంపిణి,శ్రీనివాస్ మహల్ వద్ద ఇంద్ర కిలాద్రి ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ మరియు పుస్తకాల పంపిణి, పాత రాజరాజేశ్వరి పేటలో సయ్యద్ బాబుల్లు, ఎస్ కే రియాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ మరియు మాదారస పిల్లలకు పుస్తకాలు, పండళ్ళు పంపిణి కార్యక్రమాలో ఎమ్ ఎస్ బేగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో మహానుభావులు అసువులు బాశారని అలాంటి వారి త్యాగ ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామన్నారు .ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
Tags vijayawada
Check Also
ప్రైవేట్ బస్సుల తనిఖీలు-అధిక చార్జీ వసూలు చేసే బస్సులపై చట్టపరమైన చర్యలు
-జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగకు స్వస్థలాలకు వచ్చే ప్రయాణికుల …