Breaking News

వృద్ధులను గౌరవిద్దాం- అనాధలను ఆదరిద్దాం

-వీఎల్సీ రియల్ సర్వీస్ సేవలు ఆదర్శం

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా గన్నవరంలో బీ కే ఆర్ వృద్ధాశ్రమం, అమ్మ చిల్డ్రన్ హోమ్ లలో వీఎల్సీ రియల్ సర్వీస్ టీం సభ్యులు చేసిన సేవలు ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తాయని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో వీఎల్సీరియల్ సర్వీస్ టీం అతిరధ మహారధులు సమిష్టిగా పాల్గొని జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అనాధ వృద్ధులకు, బాలబాలికలకు వి ఎల్ సి రియల్ సర్వీస్ టీం సభ్యులు బట్టల పంపిణీ మరియు అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులను గౌరవించి అనాధలను ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు వృద్ధులను గౌరవించాలి, అనాధలను ఆదరించడం ద్వారా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వి ఎల్ సి రియల్ సర్వీస్ టీం సభ్యులు సీహెచ్. విజయలక్ష్మి చౌదరి, యనమదల రమేష్, చందు. శ్రీనివాస్, గుండారపు శ్రీనివాస్, పుల్లయ్య చౌదరి, విజయలక్ష్మి, వినోద్ లు కుటుంబ సభ్యులతో సహా పాల్గొని అన్నదాన సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. బి కే ఆర్ సేవా సంస్థల ద్వారా అనాధ వృద్ధులకు బాలలకు ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్న ఆశ్రమ చైర్మన్ కానూరి శేషు మాధవిని వి ఎల్ సి రియల్ సర్వీస్ టీం సభ్యులందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. వినయ్ కుమార్, కె శ్రీనివాసరావు, బొకినాల అశోక్, కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం టీచర్ లక్ష్మి, ఆశ్రమ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *