విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ వద్ద 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత జాతీయ పతాకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కే బాబు ఆవిష్కరించగా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్(ఐజెయు) ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారత 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత రాజ్యాంగ విలువలను పరిరక్షించడం పాత్రికేయులుగా మనందరి కర్తవ్యం కర్తవ్యమని ఆయన ప్రబోధించారు. పాత్రికేయులు స్వాతంత్ర దినోత్సవ లక్ష్యాలను ప్రజలకు చేరవేసే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపిచ్చారు. తొలుత విజయవాడ అర్బన్ అధ్యక్షులు చావా రవి స్వాగతం పలుకగా కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతి రావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, జీ. రామారావు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మోదుమూడి మురళి, యూనియన్ కోశాధికారి బీవీ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News