Breaking News

ప్రధాన రహదారి పనుల యుద్ద ప్రాతిపదికన పూర్తీ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
విస్తరణ పనులు ప్రారంభం అయిన ఏటి అగ్రహారం ప్రధాన రహదారి పనుల యుద్ద ప్రాతిపదికన పూర్తీ చేయాలని, అందుకు తగిన యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాళిక విభాగం సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ నగరంలో రోడ్ల విస్తరణ పనులు చాలా నెమ్మదిగా సాగడంవలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం పట్టణ ప్రణాళిక విభాగంలో పూర్తీ స్థాయిలో అధికారులు, సిబ్బంది ఉన్నందున పనులు వేగంగా జరగాలని స్పష్టం చేశారు. ఏటి అగ్రహారం రోడ్ విస్తరణ పనులను డి.సి.పి. ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని, మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ఆక్రమణలు, స్వాధీనాలు తొలగించాలని ఆదేశించారు. వచ్చే వారంలో టి.డి.ఆర్. లేదా స్ట్రక్చరల్ నష్ట పరిహారాలు అందించే ప్రక్రియ ప్రారంభించి, విస్తరణ ప్రభావిత కట్టడాలను కూడా తొలగించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. నోటీసులు ఇవ్వడం, ఆమోదిత పత్రాలు తీసుకోవడం, పోలీసు బందోబస్తు తదితర అంశాలను సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తీ చేయాలన్నారు. పెద్ద పలకలూరు రోడ్లో కూడా విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికీ టి.డి.ఆర్. బాండ్లు లేదా నష్ట పరిహారం చెల్లింపు చేయాలని, అలాగే కొత్తపేట శివాలయం రోడ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పందుల కాలనీ దగ్గర పైప్ లైన్ పనులు వేగవంతం కావడానికి స్థానికంగా నష్ట పోతున్న స్థలాల యజమానులకు టి.డి.ఆర్. బాండ్లు ఇచ్చే ప్రక్రియ కూడా జాప్యం లేకుండా చూడలని ఏ.సి.పి.ని ఆదేశించారు. సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు హోర్డింగ్స్ ని సర్వే చేయాలని, త్వరలో వాటికి క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి, హోర్డింగ్స్ మరియు బోర్డ్ ల పై సమగ్ర విధానం అమలు చేస్తామని తెలిపారు. పట్టణ ప్రణాళిక విభాగం లీగల్ సెల్ ద్వారా పెండింగ్ కోర్ట్ కేసుల వారీగా ప్యారవైజ్ రిమార్క్స్, కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్ధాలను రోడ్ల మీద వేయకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. శిధిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి, ప్రజలు అందులో నివాసం ఉండకూడదని, వెంటనే తొలగించుకోవాలని నోటీసులు ఇవ్వాలని, నోటీసులకు స్పందించని వాటిని నగరపాలక సంస్థ తరుపునే తొలగించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఎక్కడా నగరపాలక సంస్థ అనుమతి లేకుండా నిర్మాణాలు జరగకూడదని, ఆయా సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు అక్రమ లేదా అనధికార కట్టడాలు జరగకుండా సమగ్ర పర్యవేక్షణ చేయాలని, ఎక్కడైనా జరిగితే సంబందిత కార్యదర్శి, టి.పి.ఎస్.దే భాధ్యత అని స్పష్టం చేశారు.
సమావేశంలో సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు బాబురావు, అశోక్ కుమార్, కాలేష, అజయ్ కుమార్, టి.పి.ఓ., టి.పి.ఎస్.లు, టి.పి.బి.ఓ. సర్వేయర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *