గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
నగరపాలక సంస్థలో పని చేసే కార్మికుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులు మరియు సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని, మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం, ఎక్స్ గ్రేషియా చెల్లింపు ఫైల్స్ జాప్యం పై సంబందిత సెక్షన్ గుమస్తా, ఏ.ఈ.లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ అధికారులను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థ ఉద్యోగులు మరియు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు మీట్ ది కమిషనర్ ప్రోగ్రాంను కమిషనర్ ఛాంబర్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని సహించనని, భాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం, ఎక్స్ గ్రేషియా చెల్లింపు ఫైల్స్ జాప్యం పై ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ గుమస్తా నజీర్, ఏ.ఈ. పి.వెంకటేశ్వరరావులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. అలాగే వెహికిల్ షెడ్ లో పని చేసే కార్మికుల నుండి అందిన ఫిర్యాదు మేరకు ఎంక్వయిరీ చేసి, భాధ్యులపై చర్యలు సిఫార్స్ చేయాలని ఎస్.ఈ.ని ఆదేశించారు. వచ్చే వారం కార్మికుల స్పందనకు నగరపాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న కార్మికుల్లో పి.ఎఫ్. సంబందిత సమస్యలను సచివాలయాల వారీగా గుర్తించి నివేదిక ఇవ్వాలని ప్రజారోగ్య మరియు ఇంజినీరింగ్ విభాగ సూపరిండెంట్లను ఆదేశించారు. కార్మికులు కూడా తమకు అందే జీతాలు, ఇతర అలవెన్స్ ల పై ఎవరికి ఎటువంటి నగదు ఇవ్వాల్సిన పని లేదని, ఎవరైనా నగదు డిమాండ్ చేస్తే ప్రతి గురువారం నేరుగా తమ దృష్టికి తేవాలన్నారు. కార్మికులు తమ సమస్యల పై మీట్ ది కమిషనర్ లో ఇచ్చే వాటిని రిజిస్టర్ లో నమోదు చేసి, నిర్దేశిత గడువులోగా పరిష్కారం జరగాలని అధికారులను ఆదేశించారు.
Prajavartha Online Telugu News