Breaking News

వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ప్రభుత్వ వైద్యశాలలను ఆధునీకరించడం, నూతన వైద్యశాలల నిర్మాణం ద్వారా ప్రాధమిక వైద్య సేవలను బలోపేతం చేసి పేద ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేస్తున్నారని మాజి మంత్రి, ప్రత్తిపాడు శాసన సభ్యులు మేకతోటి సుచరిత పేర్కొన్నారు. సోమవారం నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏఎస్ తో కలిసి రెడ్డి పాలెంలో రూ.90 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి, అనంతరం విలీన గ్రామాలకు త్రాగునీరు అందించే త్రాగునీటి పధకం పైప్ లైన్ పనుల శిలాపలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ. సుచరిత మాట్లాడుతూ మాట్లాడుతూ, రెడ్డి పాలెంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను రూ. 90 లక్షల వ్యయంతో అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రజలకు వైద్య సేవలు అందించే నిమిత్తం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. సమీప ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఇక్కడ నుంచి మెరుగైన వైద్యసేవలు అందించటం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా యుపీహెచ్సీ , పీహెచ్సీ ల పునరుద్దరణలో ఎక్కడా రాజీ పడకుండా ఆధునిక వైద్య పరికరాలు, డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారన్నారు. రానున్న కాలంలో సామాన్యులకు చాలా సులువుగా, అందుబాటులో వైద్యాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారన్నారు. అలాగే ఫ్యామిలి డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వైద్యాన్ని మరింత సులభతరం చేయడం జరుగుతుందన్నారు. డిజిటలైజేషన్ ద్వారా ప్రతి రోగి యొక్క మెడికల్ ట్రాక్ ను మెయింటెన్ చేయనున్నామన్నారు. అలాగే ఎప్పటినుండో విలీన గ్రామాల్లో త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, త్వరలో పైప్ లైన్ పనులు కూడా పూర్తీ చేసి ప్రజలకు సరిపడా త్రాగునీరు అందిస్తామని తెలిపారు.
కమిషనర్ గారు మాట్లాడుతూ నగరంలో ఇప్పటికే ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తీ అయ్యాయని, నూతనంగా నగరానికి మంజూరు అయిన అర్బన్ హెల్త్ సెంటర్ల లో 4 ప్రారంభం కూడా జరిగాయని తెలిపారు. త్వరలో మిగిలిన సెంటర్లను కూడా ప్రారంభించేందుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పేదలకు అత్యుత్తం వైద్యం అందుబాటులోకి వస్తుందని, పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. విలీన గ్రామాలకు, ఇన్నర్ రింగ్ రోడ్, టిడ్కో గృహాలకు త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ పనులు వేగంగా చేస్తున్నామని, త్వరలోనే ప్రాజెక్ట్ పూర్తీ చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంతటామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ సుమయాఖాన్, కార్పొరేటర్లు టి.కృష్ణారెడ్డి, సాంబిరెడ్డి, స్మిత పద్మజ, రాజ్యలక్ష్మి, నగరపాలక సంస్థ ఎస్.ఈ. భాస్కర్, అధికారులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *