Breaking News

ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రక్రియ…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1) (C ) అనుసరించి 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25% ప్రవేశాలు అమలు చేయుటకు గాను మొదటి విడత లాటరీ తదుపరి, మిగులు సీట్లకు గాను, అర్హత పొందిన విద్యార్ధులకు 2 వ విడత లాటరీ లో భాగంగా కేటాయించిన ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రక్రియకు సంబంధిచిన ఎంపిక కాబడిన విద్యార్ధుల జాబితా తేది 27.09.2022 న http://cse.ap.gov.in నందు ఉంచబడునని, మరియు అర్హత పొందిన విద్యార్ధుల ప్రవేశములు తేది 28.09.2022 నుండి తేది:10.10.2022 వరకు సంబంధిత పాఠశాలలలో జరుగునని తెలియచేయడమైనది. కావున, అందరు విద్యార్ధులు, తల్లి తండ్రులు పై విషయములలో పేర్కొన్న తేదీలను గమనించుకొని, 2 వ లాటరి లో భాగం గా 28.09.2022 నుండి తేది:10.10.2022 వరకు విద్యార్ధుల అడ్మిషన్ల ప్రక్రియ జరిగేట్లు చూసుకోవలసిందిగా కోరడమైనది.
పై తేదీలకు గాను, రాష్ట్రము లో గల అందరు జిల్లా విద్యాశాఖాధికారులు మరియు ఎడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, సమగ్ర శిక్ష వారు మీడియా మరియు పత్రిక రంగాల వారి ద్వార విస్తృతమైన ప్రచారం ఇవ్వవలసినదిగా ఆదేశములు జారిచేయుట జరిగినది. మరియు, వారి పరిధిలోగల అధికారులు అందరికి, అర్హత పొందిన పిల్లల తల్లి తండ్రులకు నేరుగా సమాచారము మరియు సూచనలు ఇచ్చి అందరు పిల్లల అడ్మిషన్ ప్రక్రియ సంపూర్తిగా జరిగేటట్లు ఆదేశములు ఇచ్చుట జరిగింది.
మరియు, అన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యముల వారు , ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కు చట్టం, 2009 లో 12 (1)(C) అమలు ద్వార ప్రవేశము పొందిన అందరు విద్యార్ధులుకు అడ్మిషన్ ప్రక్రియ నందు ఏ విధమైన అభ్యంతరములు తెలియచేయకుండా ప్రవేశము కల్పించి, ప్రభుత్వం వారు ఇచ్చు సదుపాయములు అయిన పాఠ్యపుస్తకములు, నోట్ పుస్తకములు ,యూనిఫారం , తదితరములు అన్నియు SOP ( Standarad Operating Procedure) ను అనుసరించి అమలు జరిగేటట్లు చర్యలు తీసుకోవలసిందిగా కోరడమైనది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *