Breaking News

సీనియర్ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా యువ ఓటర్లకు ఆడర్శనీయంగా నిలుస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
వయోవృద్ధులు (80 ఏళ్ల పైబడిన వారు) మరియు దివ్యాంగ ఓటర్లను గరిష్టంగా ఓటింగ్ లో పాల్గొనడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని గుంటూరు పశ్చిమ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈ.ఆర్.ఓ.) మరియు నగర అదనపు కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) బి.శ్రీనివాసరావు అన్నారు. నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ ఆదేశాల మేరకు వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం సూచనల మేరకు నగరంలోని సీనియర్ ఓటర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ వృద్ధుల దినోత్సం సందర్భంగా నగరంలో సీనియర్ ఓటర్లను అభినందిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ పంపిన అభినందన పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం సీనియర్ ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాల్లో వీల్ చైర్లు, ర్యాంప్ లు ఏర్పాటు చేస్తుందన్నారు. సీనియర్ ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా యువ ఓటర్లకు ఆడర్శనీయంగా నిలుస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఆర్.ఓ. ఎస్.ఎన్ ప్రసాద్, ఆర్.ఐ.లు, ఇతర నోడల్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *