Breaking News

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు 90 రోజుల పథకంలో భాగంగా అర్హులను, ఇండ్ల స్థలాలు గుర్తించాలి

-ఆయా స్థలాలు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి…
-జిల్లా కలెక్టర్ డా. కె. మాధవి లత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా , 90 రోజులు పథకం అమలులో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళ స్థలాల కోసం స్థలాలు గుర్తించి పంపిణీ చెయ్యాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఇంటి స్థలాల కోసం లబ్దిదారుల గుర్తింపు, స్థలాలు పంపిణీ, ద్రువపత్రాలు జారీ పై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం లో భాగంగా స్థలాలు గుర్తించి కేటాయింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి సి సి ఎల్ ఏ రూపొందించిన మార్గదర్శకాలు ఖచ్ఛితంగా పాటించాల్సి ఉంటుందన్నారు. 90 రోజులు పథకం అమలులో అర్హత ఉన్న పేదవారికి ఇంటి స్థలాలు కేటాయించడం కోసం మండల పరిధిలోని రెవెన్యూ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని అన్నారు. ప్రతి శనివారం ఎంతమంది స్థలాలు కోసం ధరకాస్తు చేసుకున్నారో నివేదికను అంద చెయ్యలన్నారు. ఇప్పటికే అర్హులైన వారికి ఇళ్ళ స్థలాల కేటాయింపు, తదుపరి ఇళ్ల పట్టాలు ప్రింటింగ్ చేసి, త్వరిత గతిన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే విధం గా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత అన్నారు. ఆయా లబ్దిదారుల వివరాలు ఈ కే వై సీ తప్పనిసరిగా చెయ్యాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం జగనన్న భూ హక్కు.. భూ రక్షా కింద జిల్లాకు చెందిన సుమారు 3,900 ధృవ పత్రాలు రావడం జరిగిందని, ఆయా పత్రాలు పరిశీలన తదుపరి మండలాలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, ఎన్ పి ఐ (నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళు) లబ్ధిదారులకు ఇంటి స్థలం పట్టాల పంపిణీ చేయడం ఎంత ముఖ్యమో, ఆ పత్రాలలో తప్పులు లేకుండా కూడా చూడాల్సిన బాధ్యత క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది పై అంతే ఉందన్నారు. ఈ విషయంలో అలక్ష్యాన్ని ఎంతమాత్రం సహించేది లేదని జెసి స్పష్టం చేశారు. ఇంటి రిజిస్ట్రేషన్ ధృవ పత్రాలలో ఎటువంటి అక్షర దోషాలు లేకుండా తనిఖీ చేసి నిర్ధారణ చేసుకున్న తరువాతే వాటిని పంపిణీ చెయ్యవలసి ఉంటుందని పేర్కొన్నారు. అవి సక్రమంగా ఉన్నాయని నిర్ధారణ అయితేనే పట్టాలు ముద్రణ కోసం సి సి ఎల్ ఏ కి డేటా అప్లోడ్ చేయాలన్నారు. ఈ విషయంలో తప్పులు లేకుండా చూడాలని, ఒక వేళ పొరపాటు జరిగితే, సంబందించిన డేటా అప్లోడ్ చేసిన తహశీల్దార్, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఆర్డీఓ, ఎ చైత్ర వర్షిణి, జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి పి. లక్ష్మణ రావు, రాజమండ్రి డివిజన్ లోని తాహిసీ ల్దార్ లు, సర్వేయర్ లు కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

-రైతు యాతం నాగేశ్వరరావుకి గోవులు అందజేత -రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం -మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *