పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్డీవో వెన్నెల శ్రీను

-జి.కొండూరు, మైలవరం ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ ప్రక్రియ తనిఖీ
-ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేందుకు అధికారులకు సూచనలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీను గురువారం జి.కొండూరు, మైలవరం ప్రాంతాల్లో పర్యటించి పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ, ఓట్ల లెక్కింపు విధానాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా పూర్తయ్యేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీవో వెన్నెల శ్రీను సూచించారు.