విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్పోరేషన్ (NICDC) శుక్రవారం విశాఖపట్నంలోని ది పార్క్ హోటల్‌లో లాజిస్టిక్స్ డేటా సర్వీసెస్ లిమిటెడ్ భాగస్వాముల సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం సుమితా దావ్రా, IAS, ప్రత్యేక కార్యదర్శి, DPIIT అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జీవీషా జోషి CEO MD, NICDC ఛైర్మన్, NLDSL., DPIIT జాయింట్ సెక్రటరీ, అభిషేక్ చౌదరి, వైస్ ప్రెసిడెంట్, NICDC డైరెక్టర్ NLDSL తో పాటు , NLDSL ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశాన్ని పురోగ పరచేందుకే పీఎం గతిశక్తి ఎన్‌ఎంపీని ప్రారంభించామని ప్రత్యేక కార్యదర్శి సభను ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 2021లో ప్రధాన మంత్రి దీనిని ప్రారంభించినప్పటి నుండి, జాతీయ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించడం వంటి అనేక లక్ష్యాలు సాధ్యమయ్యాయి.
లాజిస్టిక్స్ అధిక వ్యయాలను తగ్గించడానికి, భారత ప్రభుత్వం జాతీయ లాజిస్టిక్స్ పాలసీ (NLP)లో భాగంగా 17 సెప్టెంబర్ 2022న గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ (ULIP)ని అభివృద్ధి చేసింది. లాజిస్టిక్స్ సంబంధిత డేటాసెట్‌లను యాక్సెస్ చేయడానికి పరిశ్రమల అనుకూలత కోసం యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ ని భారతదేశ డిజిటల్ గేట్‌వేగా రూపొందించారు దీనివల్ల, భారతీయ లాజిస్టిక్స్ సెక్టార్ కోసం పరస్పర అనుసంధానమై సాంకేతికతతో కూడిన ఫ్రేమ్‌వర్క్ ను అభివృద్ధి చేస్తోంది.
ULIP – ప్రారంభించినప్పటి నుండి, అద్భుతమైన స్పందనను పొందింది. ఇప్పటివరకు, 350 కంటే ఎక్కువ కంపెనీలు, కీలక వ్యవస్థలు, సంస్థలు అలాగే అంకుర పరిశ్రమలు దీనిని అనుసరిస్తున్నాయి. లాజిస్టిక్స్ సంబంధిత డేటాసెట్‌లకు యాక్సెస్ పొందడానికి ప్లాట్‌ఫారమ్‌లో నమోదు అయిన JSW, Ultratech Cement, Ship Rocket, Shypmax, DHL, Map My India, Cargo Exchange, Yes Bank, Intugine వంటి కొన్ని అగ్రశ్రేణి ప్రైవేట్ రంగ సంస్థలు నాన్ డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (NDA)పై సంతకం చేశాయి. ప్రస్తుతం ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వ్యవస్థ వల్ల కార్గో తరలింపు పర్యవేక్షణ, సరుకుల ట్రాకింగ్, ఇన్వెంటరీ నిర్వహణ వంటి ప్రయోజనాల లబ్ది పొందుతున్నాయి.
వాహన అలాట్ మెంటు , డ్రైవర్ ధృవీకరణ, ఆటోమేటెడ్ కస్టమర్- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొదలైన కార్యకలాపాలను సమర్థ అమలుకు – డిజిటలైజ్ చేయడానికి కంపెనీలకు ఈ ఏకీకరణ వ్యవస్థ సహాయం చేస్తోంది. మల్టీ-మోడల్ ట్రాకింగ్, డాక్యుమెంట్ కోసం సింగిల్ విండో వంటి వారి కస్టమర్‌ల కోసం విలువ ఆధార సేవలను, స్టేటస్ వెరిఫికేషన్ ఆమోదం, సర్వీస్ డిస్కవరీ, అనలిటిక్స్, మొదలైనవి రూపొందించడంలో కంపెనీలకు ఇది సహాయపడుతుంది., సరుకు రవాణాదారులు, సరుకులు పంపేవారు, ఎగుమతిదారులు, ఫ్రైట్ ఫార్వార్డర్‌లు, CHAలు, ICD/CFS ఆపరేటర్లు, 3PL/4PL ప్లేయర్‌లు, తయారీదారులు, ఎంటర్‌ప్రైజెస్, ఇ-కామర్స్ కంపెనీలు మొదలైన లాజిస్టిక్స్ భాగస్వాములు ఇందులో ఉన్నారు. గేట్ ఆటోమేషన్, డిజిటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (eKYC), యార్డ్/వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్, ట్రాక్ అండ్ ట్రేస్, డిస్కవరీ సర్వీసెస్ వంటి వివిధ సేవలను అమలు చేయడం కోసం ULIP ప్రయోజనాలు ఉపయుక్తమైనవి . సంబంధిత రంగాలకి కొత్త వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ఇది అంకుర పరిశ్రమలకు కూడా సహాయపడుతుంది.
ఇప్పటి వరకు ULIP గేట్‌వేలో డేటా మార్పిడికి సంబంధించిన 5 కోట్లకు పైగా ప్రత్యక్ష లావాదేవీలు నిర్వహించినట్లు భాగస్వాముల సమావేశంలో కార్యదర్శి తెలియపరచారు. 56 కంటే ఎక్కువ ప్రైవేట్ సంస్థలు పాల్గొన్న NDA సమీక్షలో అమలు అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ULIP సేవలను యాక్సెస్ చేయడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానం (SOP) తయారు చేశారు. ULIP అధికారిక వెబ్‌సైట్ goulip.in నుండి వివరాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్- డేటా యాక్సెస్ ప్రాసెస్‌లలో వినియోగదారులకు మద్దతుగా ఇమెయిల్, చాట్- టోల్-ఫ్రీ నంబర్ ద్వారా ప్రత్యేక సాంకేతిక సహాయ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది.
DPIIT, CEO, ప్రత్యేక కార్యదర్శి, MD, NICDC, NLDSL చైర్మన్ ఐన సుమితా దావ్రా,IAS, తన ప్రసంగంలో, భవిష్యత్తులో, దేశంలోని అన్ని లాజిస్టిక్స్ లావాదేవీలను ప్రామాణీకరించడానికి ULIP ఒక గేట్‌వే పాత్రను పోషిస్తుందని అన్నారు. లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడం, వ్యయాన్ని తగ్గించడం, సామర్థ్యాన్ని పెంచడం- దేశీయంగా తయారైన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడేలా చేయడంలో యులిప్ ఎంతో దోహదపడుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం సంబంధిత సంస్థలు goulip.inలో నమోదు చేసుకోవాలని- అలాగే కొనుగోలు దారుల సౌలభ్యం కోసం దీని నుండి ప్రయోజనాలను పొందాలని ఆమె అందరినీ స్వాగతించింది.
జీవీషా జోషి, ద్వారా ప్రధానమంత్రి గతిశక్తి ఇటీవలి అప్‌డేట్‌ల ప్రదర్శనను కూడా ప్రదర్శనలో ఆహుతులు చూశారు. జాయింట్ సెక్రటరీ, DPIIT మాట్లాడుతూ ఈ సౌలభ్యం కింద నేటికి 1300కి పైగా లేయర్‌లు నమోదు అయ్యాయని అని ఆమె తెలియజేశారు . కేంద్ర మంత్రిత్వ శాఖల 30 వ్యక్తిగత పోర్టల్‌లు- 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల , రాష్ట్ర మాస్టర్ ప్లాన్ పోర్టల్‌లు కూడా అభివృద్ధి చేశారు . కేంద్ర మంత్రిత్వ శాఖల 30 వ్యక్తిగత పోర్టల్‌లు- 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మాస్టర్ ప్లాన్ పోర్టల్‌లు కూడా అభివృద్ధి అయ్యాయి..
ఈ భాగస్వాముల సమావేశానికి విశాఖపట్నంలో ఉన్న లాజిస్టిక్స్ పరిశ్రమ- అసోసియేషన్‌లకు చెందిన ఉన్నతాధికారులు ఉత్సాహంగా హాజరయ్యారు. ULIP అంతిమ లక్ష్యం గా పరిశ్రమ నుంచి ఉత్తేజకర ప్రతిస్పందన రావడం ప్రభుత్వం తరపున సమాచార ప్రజాస్వామ్యీకరణకు ఒక ముఖ్యమైన అడుగు. సరసమైన పోటీతో పాటు గుత్తాధిపత్యాన్ని రద్దు చేయడం- స్థాయి లేని ప్రయోజనం ఆధారంగా ఆదాయ ఉత్పత్తి కోసం మార్కెట్‌ను సృష్టించేందుకు ఇది అనుకూలం గా ఉంటుంది.
Prajavartha Online Telugu News