Breaking News

విద్యుత్‌ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష.

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవిలో విద్యుత్‌ డిమాండ్‌, రైతులకు విద్యుత్‌ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని అధికారులు అన్నారు. మార్చి, ఏప్రిల్‌ నెలలో సగటున రోజుకు 240 మిలియన్‌ యూనిట్లు, ఏప్రిల్‌లో 250 మిలియన్‌ యూనిట్లు ఉంటుందని అంచనా వేశామని అధికారులు అన్నారు. ఇప్పటికే పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌లో ముందస్తుగా విద్యుత్‌ను బుక్‌ చేసుకున్నామని అధికారులు అన్నారు.
ఈ సందర్భంగా వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదని స్పష్టంచేశారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలనే సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. ఆ మేరకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు. బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామని అధికారులు అన్నారు. రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టంచేశారు. ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామని అధికారులు అన్నారు. మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడి.విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు అధికారులు వెల్లడిరచారు. మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామని అధికారులు అన్నారు. అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని వెల్లడి. ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని అధికారులు వెల్లడిరచారు. ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని వెల్లడి. ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్‌, అటవీ పర్యావరణం, మైన్స్‌ అండ్‌ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్‌, పరిశ్రమలుశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్‌, ట్రాన్స్‌కో జేఎండీలు పృధ్వీతేజ్‌, మల్లారెడ్డి సీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్ధనరెడ్డి, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ ఎస్‌.రమణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *