Breaking News

ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ఆవిష్కరించిన సీఎం వైయస్‌.జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ టూరిజం కాఫీ టేబుల్‌ బుక్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 నేపధ్యంలో ఏపీ టూరిజం, హ్యండీక్రాఫ్ట్స్, టెంపుల్స్, బీచ్‌లు, సోల్స్‌ స్పేస్, ఏ టూ జెడ్‌ టేబుల్‌ గైడ్‌పై ప్రత్యేక పుస్తకాలను ఏపీ ప్రభుత్వం ప్రచురించింది. ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్‌ బాషల్లో పుస్తకాలు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, టూరిజం సెంటర్స్‌లో ఏపీ ప్రత్యేకతలు వివరిస్తూ పుస్తకాలు, ఏపీలో టూరిజం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణంపై ఈ పుస్తకాలలో ప్రత్యేక కథనాలు. బెస్ట్‌ టూరిజం పాలసీ అవార్డును కైవసం చేసుకున్న ఏపీ ప్రభుత్వ టూరిజం శాఖ, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ టూరిజం పాలసీని అధ్యయనం చేస్తున్నాయని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ఆ శాఖ అధికారులు. అభినందించిన ముఖ్యమంత్రి, రానున్న రోజుల్లో టూరిజం డెస్టినేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌ వన్‌ గా ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలోనూ అభివృద్ది పథంలో నడిపిస్తూ, పెట్టుబడులకు స్వర్గధామంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి.అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టూరిజం శాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ రజత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్‌.కరికాల్‌ వలవెన్, సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మ విజయ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *