Breaking News

ఏప్రిల్ 10 వ తేదీకల్లా ప్రజలకు కంబాల చెరువు అందుబాటులోకి తీసుకుని రావాలి

-అందుకనుగుణంగా ప్రతిపాదించిన అత్యవసర పనులు పూర్తి చెయ్యాలి
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో సందర్శన కేంద్రంగానూ, పర్యాటక కేంద్రంగా కంబాల చెరువు అభివృద్ధికి చర్యలు చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు ఆదివారం కంబాల చెరువు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ మాధవీలత, మున్సిపల్ కమిషనర్ కె.దినేష్ కుమార్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ , రాజమహేంద్రవరం నడి ఒడ్డున ఉన్న కంబాల చెరువు పార్క్ నకు  ప్రజలు అధిక  సంఖ్యలో  వాకింగ్ కి వస్తుంటారని,  వీరందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చేపట్టిన పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 10 వ తేదీ నాటికి నగర ప్రజలకు అందుబాటులో తీసుకుని వొచ్చే విధంగా ఆయా ప్రతిపాదిత పనులు పూర్తి చేయాలన్నారు. వర్షపు నీరు, ఇతర మురుగు వాటర్ చెరువులో కలవకుండా మళ్లింపు దిశగా డ్రై న్ నిర్మాణం పనులు పురోగతి పై సమీక్ష చేశారు. ప్రస్తుతం చెరువులో ఉన్న నీటిని  శుభ్రపరచి, ఆహాల్లదకర వాతావరణం ఉండేలా విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబ సమేతంగా  కంబాలచెరువు పార్కు కు విచ్చేసే ప్రజలకు, పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ అన్నారు. కంబాల చెరువు రాజమండ్రి ప్రజానీకం అందరూ ఉపయోగించుకునే విధంగా అన్ని రకాల హంగులతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఏప్రిల్ 10 వతేది నాటికి సందర్శులకు, వకర్స్ కోసం అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు ఎక్కువ సంఖ్యలో రానున్న దృష్ట్యా యుద్ద ప్రాతిపదికన పెండింగ్ పనులు పై దృష్టి పెట్టి పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చెయ్యడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదే తరహాలో నగరంలో మరో మూడు ప్రాంతాల్లో త్వరలో ఈట్ స్ట్రీట్ లు ఏర్పాటు చెయ్యడం కోసం చర్యలు తీసుకోవడంజరుగుతున్నాట్లు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ నగరాన్ని పర్యటన పరంగా అభివృద్ధి పనులు చెయ్యడం జరుగుతోందని అన్నారు. కంబాల చెరువు మధ్యలో ఏర్పాటు చేస్తున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పురోగతి పై కమిషనర్ సమీక్ష చేస్తూ, త్వరిత గతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ ఈజీ. పాండు రంగారావు, ఈ ఈ గిరిధర్, నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *