విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 12సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 22,21,17,18,12,4,6 డివిజన్లలో పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం పార్టీ నాయకులు,అభిమానూలు సమక్షంలో కేక్ కట్ చేసి పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు .ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్వర్గీయ గౌ” శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణానంతరం ఆయన ఆశయాలు కొనసాగించాలనే మంచి ఉద్దేశంతో వై.యస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందని 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 67స్థానాల్లో విజయం సాధించి బలమైన ప్రతిపక్షంగా ఏర్పడి ప్రతిపక్ష నాయకుడిగా వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను శాసన సభలో ప్రస్తావించి ప్రజాసంక్షేమం కోసం పరితపించే వారని అన్నారు. అయినప్పటికీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు సమస్యలను పట్టించుకోకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న తరుణంలో వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి రాష్ట్రమంతా పాదయాత్ర వారి సమస్యలను తెలుసుకొని ప్రజాసంక్షేమం కోసం నవరత్నాలు పథకాలతో పాటు అనేక రకాల పథకాలను రూపొందించి ప్రజలకు వివరించడం జరిగింది. 2019 లో జరిగిన ఎన్నిలలో వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151స్థానాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా గౌ” వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టటం జరిగిందని నాటి నుండి నేటి వరకు ప్రజా సంక్షేమం కోసం అనేక రకాలుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేశారని అన్నారు.జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఎక్కువగా ఉండటంతో ప్రతిపక్షాలకి ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,ఎన్టీఆర్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొరివి చైతన్య,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,కార్పొరేటర్లు రామిరెడ్డి,కొండారెడ్డి,అమర్నాధ్,ఇంచార్జిలు గల్లా పద్మావతి,మాగంటి నవీన్ మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవినేని నెహ్రు ట్రస్ట్ ఆధ్వర్యంలో 12 ఇస్త్రీ పెట్టెలు పంపిణి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 12వ డివిజన్ నందు నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేసిన తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్. ఈ సందర్భంగా డివిజన్ లో నివసించే 12 కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 12 ఇస్త్రీ పెట్టెలను అందజేశారు. రాజకీయంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నగర వ్యాప్తంగా విద్య,ఉపాధి, వైద్య సహాయం అవసరమైన వారికి అండగా నిలుస్తున్నామని అవినాష్ తెలిపారు.
Prajavartha Online Telugu News