Breaking News

అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలో సభ్యత్వం తీసుకోవడం గొప్ప విషయం ఎంపీ కేశినేని శ్రీనివాస్ 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెదేపా కార్యాలయంలో ఎంపి కేశినేని నాని ముఖ్య అతిథిగా జరిగిన సమావేశంలో 51వ డివిజన్ కు చెందిన పలువురు వై యస్ ఆర్ సి పి నాయకులు, కార్యకర్తలు వైసిపి పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ సిఎం జగన్ కు ఒక గమ్యం, లక్ష్యం లేదని, వ్యక్తిగత అజెండా తోనే పాలిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీకి పాల్పడటమే పనని, వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో దోపిడీ చేస్తోందని విమర్శించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. పశ్చిమ నియోజక వర్గంలో రోడ్లు వేయలేని పరిస్థితి ఉందని, విశాఖ సమ్మిట్ కి వచ్చిన వారందరూ పెట్టుబడులు పెడతారన్న గ్యారంటీ లేదని అన్నారు.

మాజీ ఎమ్మెల్యే జనాబ్ జలీల్ ఖాన్ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం లో విడుదల చేసిన నిధులతో నిర్మించిన రోడ్లు, హజ్ హౌసును వారేదో నిర్మించినట్టు శిలాఫలకాలు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు

MS బేగ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని ఏ ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అందలేదని కేశినేని నాని నిధులతో డివిజన్లో డ్రైనేజీ మరియు రోడ్డు నిర్మాణ అభివృద్ధి జరుగుతుందని అది చూసి వైకాపా కార్యకర్తలు టిడిపిలో సభ్యత్వం తీసుకోవడం జరుగుతుందని కేశినేని శ్రీనివాస్ ఒక్క పశ్చిమ నియోజకవర్గంకే పరిమితం కాకుండా జిల్లాలో అనేక నియోజకవర్గం ఆయన అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని తిరిగి మరల మూడవ సారి కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఎంపీగా చూడాలని అదే తమ ఉద్దేశమని అందుకు అనుగుణంగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాల్సిందిగా కోరారు.

అనంతరం డివిజన్ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జ్ ఆధ్వర్యంలో 51 వ డివిజన్ నుండి చిల్లా సుగుణ రెడ్డి ( శ్రీ చలమరాజు వెంకట శేషయ్య సత్రం ట్రస్ట్ బోర్డ్ సభ్యులు) చిల్లా వెంకట్ రెడ్డి, (51 డివిజన్ సెక్రటరీ ) పోలవరపు ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది కార్యకర్తలు పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది

ఈ కార్యక్రమంలో లింగమనేని శివరామ ప్రసాద్, జిల్లా కార్యాలయ కార్యదర్శి సారెపల్లి రాధాకృష్ణ, రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు అమానుల్లా, ఎస్సీ సెల్ అధికారి ప్రతినిధి పరిశీపోగు రాజేష్, పశ్చిమ నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత నియోజకవర్గం మైనారిటీ అధ్యక్షులు షేక్ హబీబ్, సుఖాసి కిరణ్, బేవర సాయి సుధాకర్, బుర్ర కనకారావు, డివిజన్ అధ్యక్షులు నాగేశ్వర రావు, చిన్న సుబ్బయ్య నీలం మనోజ్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కొప్పుల గంగాధర్ రెడ్డి, దూది బ్రహ్మయ్య యాదవ్, మైలంపల్లి రాజు, గంటా రాజు దేవర రవి తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *