Breaking News

ఏపీ రెడ్డి సంఘం ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ…

-త్వరలో జిల్లా వ్యాప్తంగా పర్యటన..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఎన్టీఆర్ జిల్లా నూతన కమిటీ ఏర్పాటు ఆదివారం విజయవాడలోని సూర్య రావు నగర్ నందు ఉన్న ఎం.జి.టి కళ్యాణ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కమిటీలో ఎన్నికైన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ల జనాభా 60 లక్షల పైచిలుక ఉంది వీరిలో చాలామంది పేదరికంలో మగ్గుతున్నారు వీరందరికీ సంక్షేమ పథకాలు అందేలా అదే విధంగా న్యాయపరంగా హక్కుల సాధనకు నిరంతరం పోరాడుతుంది. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం పోరాటాల వలన రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, ఈ బీసీ నేస్తం లాంటి సంక్షేమ పథకాలు సాధించడం జరిగింది. రెడ్ల కోసం పోరాటాలు చేస్తూనే మరొకపక్క పేద రెడ్ల సంక్షేమం కోసం సహాయ సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. రాజకీయ పార్టీలకు అతీతంగా రెడ్లను కలిసి సంఘంలోకి ఆహ్వానించాలని నూతన కమిటీకి తెలియజేశారు. జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా డి. ఉమాపతి రెడ్డి, ఉపాధ్యక్షులుగా బి. నరసింహారెడ్డి, ఈదా రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె. శ్రీనివాసరెడ్డి, కార్యదర్శిగా కె. సరోజారెడ్డి, సహాయ కార్యదర్శిగా సూర్యనారాయణ రెడ్డి ని, కార్యవర్గ సభ్యులుగా కృష్ణారెడ్డి, జి. శంకర రెడ్డి ని ఎన్నుకున్నారు. ఎన్నిక తదనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని గోపాల్ రెడ్డి మాట్లాడుతూ నూతన కమిటీ జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసి పూర్తిస్థాయి జిల్లా కమిటీ తో పాటు, మండల నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జి శ్రీనివాసరెడ్డి, కే రామకృష్ణారెడ్డి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రెడ్డి ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భవనం రామిరెడ్డి, మేడా వెంకటరెడ్డి, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *