Breaking News

పాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి..

మండల, గ్రామ టీమ్‌లు చురుగ్గా వ్యవహరించండి..
మహిళా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి..
జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న పాలవెల్లువలో పాల సేకరణ పెంచే విధంగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
జగనన్న పాలవెల్లువ పై శుక్రవారం నగరంలోని కలెక్టర్‌ విడిది వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులతో సమీక్షించి సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డివో, యంపిడివోలు, తహాశీల్థారు, ఏపియంఏలు, పశువైద్యులు, రూట్‌ ఇన్‌చార్జులతో వీడియోకాన్ఫరెన్స్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, మహిళా పాడి రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న పాల వెల్లువ పథకాన్ని తీసుకువచ్చారని ఈ పథకాన్ని అధికారులు సహకారంతో సమర్థవంతంగా నిర్వహించి జిల్లాను జగనన్న పాల వెల్లువ పథకంలో అగ్రగామగా నిలపాలని అన్నారు. జిల్లాలోని జి కొండూరు, మైలవరం, గంపలగూడెం, తిరువూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, ఏ కొండూరు మండలాలలో జగనన్న పాలవెల్లువ పథకం అమలు జరుగుతుందన్నారు. ఈ మండలాలలో 15,334 మంది మహిళా పాడి రైతులు నమోదై ఉన్నారని వీరిలో 4,673 మంది మహిళా పాడి రైతులు మాత్రమే పాలను కేంద్రాలలో సరఫరా చేస్తున్నారని మిగిలిన వారు పాలను సరఫరా చేయకపోవడానికి గల కారణాలను తెలుసుకుని సరఫరాలలో ఎదైన సమస్య ఎదురైతే వాటిని పరిష్కరించి పాలను సరఫరా చేసేలా ప్రోత్సహించాలన్నారు. జగనన్న పాలవెల్లువ ప్రారంభం నాటి నుండి నేటి వరకు 15 లక్షల లీటర్లకు పైగా పాల సేకరణ జరిగిందన్నారు. అయితే కొన్ని మండలాలలో పాల సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సంబంధిత ప్రమోటర్స్‌ దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రం నుండి రోజుకు 100 లీటర్లు పాల సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని దీనిపై గ్రామ మండల టీమ్‌లు, మహిళా పాడి రైతులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పాల సేకరణపై ప్రతి వారం సమీక్షించుకుని తక్కువ పాల సేకరణ జరిగే కేంద్రాలలో తగిన కారణాలను సమీక్షించుకోవాలన్నారు. పాల సేకరణ జరిగే ఉదయం సమయంలో క్షేత్రస్థాయిలో పరిశీలించి లోటుపాట్లను తెలుసుకోవాలన్నారు.జిల్లాలో అధిక పాలన ఇచ్చే పశు జాతులు ఉన్నప్పటికి పాల సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంపై అధికారులు సమీక్షించుకోవాలన్నారు. అధికారులు పోటీతత్వంతో పని చేసి ప్రైవేట్‌ డైరీలకన్న ఆటోమెటిక్‌ బల్క్‌ యూనిట్‌ కేంద్రాల (ఎయంయుఎల్‌) సంస్థ వారు మెరుగైన పాల ధర గరిష్టంగా లీటర్‌కు రూ.85.80 ఇస్తున్నారని పత్రీ గ్రామంలోని పాడి రైతులకు తెలియజేసి జగనన్న పాల వెల్లువ కేంద్రాలలో పాల సేకరణ పెంచే విధంగా కృషి చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, పశుసంర్థక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డా కె.విద్యా సాగర్‌, తిరువూరు ఆర్‌డివో వైవి ప్రసన్న లక్ష్మి, ఏపిడిడిసిఎఫ్‌ సైదులు, జిల్లా సహాకార శాఖ అధికారి సిహెచ్‌ శైలజ, నోడల్‌ ఆఫీసర్‌ డా. కృష్ణమూర్తి, అమూల్‌ డైరి ప్రతినిధి ధీరజ్‌, సంబంధిత మండలాల యంపిడివోలు, తహాశీల్థారు, ఏపియంఏలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *