-మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం చేసేవారిపై కఠిన చర్యలు…
-పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ డిల్లీరావు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాదక ద్రవ్యాల రవాణా వినియోగం పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఆసాంఫీుక శక్తులపై కేసులు నమోదు చేసి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా తెలిపారు.నషా ముక్తి భారత్ అభియాన్‌లో భాగంగా మాదక ద్రవ్యాల నివారణకు చేపట్టిన చర్యల పై శుక్రవారం కలెక్టర్ విడిది కార్యాలయం వీడియోకాన్ప్‌రెన్స్ హాల్ నందు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.సమావేశంలో పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల నివారణ అమ్మకం వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత మూడు నెలలుగా గంజాయి మత్తుపదార్థాల వినియోగంపై దృష్టి పెట్టామన్నారు. విజయవాడ పరిధిలోని గంజాయి వినియోగానికి హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన క్రీస్తురాజుపురం, గంగిరెద్దులదిబ్బ, కెఎల్‌రావు నగర్, రైల్వే యార్డ్, వాంబేకాలనీ, కృష్ణలంక దోభిఘాట్, భవానిఘాట్, కనకదుర్గవారది, ఇబ్రహీంపట్నం, సీతానగరం తదితర ప్రాంతాలలో మాదక ద్రవ్యాల వినియోగించే ప్రాంతాలలో తనిఖీలను ముమ్మరం చేశామన్నారు. గంజాయి అమ్మకం నిర్వహించే వారిపై కఠిన చర్యలు నమోదు చేయాలని ఆదేశించామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగించే వారిపై గత మూడు మాసాలలో 69 కేసులు నమోదు చేసి 159 మందిని ఆరెస్ట్ చేయడం జరిగిందన్నారు. 8 మంది గంజూయి సరఫరా దారులను అదుపులోకి తీసుకుని వారిపై పిడి యాక్ట్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగంచే హాట్‌స్పాట్ల పై దృష్టి పెట్టామన్నారు. గంజాయి వినియోగంచే వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి వివరాలను సేకరించి ఎజెన్సీ ప్రాంతం నుండి జిల్లాకు గంజాయి సరఫరా చేసేవారిని గుర్తించి కేసులు నమోదు చేశామన్నారు. అవనమైతే నగర బహిష్కరణకు వెనుకాడబోమన్నారు. ముఖ్యంగా పేదల నివాస ప్రాంతాలు, మురికి వాడలు, పాఠశాలలు, కళాశాలలో మత్తుపదార్థాల వినియోగిస్తే కలిగే దుష్పలితాలు, చట్టాలు, కేసులపై అవగాహన కల్పిస్తునట్లు ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ పై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. గంజాయి రవాణాలో సరఫరా దారులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని వీటిపై దృష్టి పెట్టి అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టిందన్నారు. ఇటీవల గంజాయి వినియోగదారులలో భయం కల్పించే పరిస్థితులు తీసుకు రావడంతో కొంత మేరకు ఫలితాలను సాధించగలిగామన్నారు. స్వచ్చంద సంస్థలు ప్రజలు గంజాయి వినియోగంచే వారి సమాచారాన్ని పోలీస్ యంత్రాంగానికి అందించి మాదక ద్రవ్వాలు మత్తుపదార్థాల నివారణకు సహకరించాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి తరచు కళాశాలకు గైరుహాజరయ్యే వారిని, అనారోగ్యానికి గురైన విద్యార్థులు దురలవాట్లకు పాల్పడుతున్నట్లు ముఖకవలికల ద్వారా గమనిస్తే అటువంటి వారిపై ప్రత్యేక నిఘా పెట్టి మాదక ద్రవ్వాలను వినియోగిస్తునట్లు నిర్థారణకు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.మీడియా ప్రతినిధుల సమావేశంలో సబ్ కలెక్టర్ అదితి సింగ్, డిసిపి విశాల్ గున్నీ, విభిన్నప్రతిభావంతుల జిల్లా సంక్షేమ అధికారి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News