తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి పేర్కొన్నారు. శనివారం ఉదయం తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి గంగ జాతర సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణస్వామి అమ్మవారికి సారె సమర్పించారు, గంగమ్మ ఆలయం చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి,నగర మేయర్ డాక్టర్ శిరీష,ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు, అనంతరం అమ్మవారికి సారె సమర్పించి అమ్మవారి కి ప్రత్యక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి ఆలయం నందు మీడియాతో మాట్లాడుతూ గంగమ్మ ఆలయ దిన దిన అభివృద్ధి చేయడమే కాకుండా తిరుపతి గంగమ్మ ఆలయానికి జాతీయ హోదాగా తీసుకొచ్చి చరిత్ర సృష్టించిన ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానుని, దీనికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ విశిష్టతను ఎవ్వరు కూడా తీసుకురాలేదని, ఎమ్మెల్యే చొరవ తీసుకొని గంగమ్మ తల్లి చరిత్రను తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో తిరుపతి గంగమ్మ ఆలయానికి గుర్తింపు తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలను గంగమ్మ తల్లి చల్లగా చూడాలని, అదేవిధంగా కరుణాకర్ రెడ్డిని, రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీ గంగమ్మ తల్లి కృప కటాక్షాలు నిండుగా ఉండాలని కోరుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారికి సారి సమర్పించి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ గోపి యాదవ్ ఈవో ముని కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.