అంగరంగ వైభవంగా మేళతాలు,మంగళ వ్యాద్యాల నడుమ గోవిందరాజ స్వామి వారు గంగమ్మకు పుట్టింటి సారె.

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే జె ఈఓ వీర బ్రహ్మ చేతుల మీదుగా శ్రీ గోవింద రాజు ఆలయం నుండి అమ్మవారి కి సారె శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ గోపి యాదవ్ భక్తి శ్రద్ధలతో శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లికి స్థానిక గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన పసుపు, కుంకుమ, పూలు, పళ్లు, రవిక, పట్టు చీరలను పల్లెలం ఉంచి తల పై పెట్టుకొని ఊరేగింపుగా కర్నాల్ వీధి, బేరి వీధి, కృష్ణాపురం టా నాలుకలు మండపము పెద్దకాపులు అవుట్ ద్వార ఊరేగింపుగా గంగమ్మ ఆలయం కు చేరుకున్న సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు
గ్రామ దేవత అయ్యిన గంగమ్మ తల్లికి సారె సమర్పణ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, తితిదే జేఈవో వీర బ్రహ్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా భక్తి యాత్ర నిర్వహించారు. భక్తులతో వీధులన్నీ వేపాకు తోరణాలతో పాటు మామిడి, అరటి తోరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దారి పొడవునా మహిళా భక్తులు పసుపు నీళ్లు కుమ్మరిస్తూ, టెంకాయలు కొట్టుతూ కర్పూర హారతులిస్తూ స్వాగతించారు.

భక్తులు పెద్ద ఎత్తున గంధం బొట్లు పెట్టుకుని, వేపాకు చేతబూని, వివిధ వేషధారణలతో విచ్చేసి భక్తి శ్రద్దలు ప్రపత్తులు చాటుకున్నారు. రాష్టంలోనే వివిధ జిల్లాల కు చెందిన వివిధ రకాల కళాకారులు దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోయారు. గంగమ్మ నామ స్మరణతో తిరునగరి హోరెత్తింది. నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు,తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల కళాప్రదర్శలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. వేసవి తీవ్రతను లెక్కచేయకుండా భక్తులు శోభా యాత్ర గా గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. గోవిందరాజ స్వామి ఆలయం నందు నిర్వహించిన ప్రత్యక పూజా కార్యక్రమాల్లో టీటీడీ అధికారులు , నగర మేయర్ డాక్టర్ శిరీష్, డిప్యూటీ మేయర్ భూమన అభినయ రెడ్డి, తితిదే అధికారులు, ఆలయ పాలక మండలి సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *