రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రిజిస్టర్ చేయబడని అసిస్టెడ్ రెప్రోడెక్టివ్ టెక్నిక్స్ కేంద్రాలు (ART centre’s) మరియు స్కానింగ్ కేంద్రాలను నిర్వహించడం చట్టవిరుద్ధంగా పరిగణించ బడతాయని మరియు వాటిపై PCPNDT Act మరియు సరోగసి యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయాని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, సంతాన సాఫల్య కేంద్రాలు నిబంధనలు పాటించాలని , పాటించకుండా అనుమతులు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అసిస్టెడ్ రెప్రోడెక్టివ్ టెక్నిక్స్ కేంద్రాలు (ART centre’s) సంతాన సాఫల్య కేంద్రాలు నిర్వహణకు అనుమతులు ఉన్నవా లేవా అని అందులో పని చేసే వైద్యులు మరియు సిబ్బంది యొక్క వివరాలు, ల్యాబ్ పరికరాలు వాటి పత్రాల ద్వారా నేషనల్ ART పోర్టల్ నందు అప్లై చేసుకోవాలన్నారు. నిర్దేశించిన రుసుము చెల్లించి అప్లికేషన్ వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి సమర్పించాలని తెలియజేశారు.జిల్లా ఏ ఆర్ టి ఇన్స్పెక్షన్ టీం (District ART inspection Team) గా ఒక గైనకాలజీ వైద్యులు, ఒక పాథాలజీవైద్యులు ,ఒక రేడియాలజిస్ట్ , సోషల్ వర్కర్, మోనటరింగ్ కన్సల్టెంట్ మరియు ఎన్జీవోలతో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి తో బృందంగా వెళ్లి అప్లై చేసుకున్న కేంద్రాలను తనిఖీ చేసి , ఈ అప్లికేషన్లను జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న అప్రాప్రియెట్ అథారిటీ కమిటీలో అనుమతి పొందిన తరువాత తదుపరి రాష్ట్రానికి పంపించవలెనని తెలియజేశారు. రిజిస్టర్ నెంబర్ తో కూడిన సర్టిఫికెట్ ను ఆయా కేంద్రాలలో అందరకు కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలియ జేశారు ఈ విధమైన రిజిస్టర్ సర్టిఫికేట్ లేని సంతాన సాఫల్యత కేంద్రాలను నమ్మవద్దని ఏమైనా ఇటువంటి ఆసుపత్రులు ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో ఎన్ సత్య కుమార్, సత్యవతి , ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags Rājamahēndravaraṁ
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …