Breaking News

కలెక్టర్ దత్తత తీసుకున్న రేలంగి ఇవాంశిక పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, జేసీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పౌష్టికాహర లోపం బలహీనంగా ఉన్న పిల్లల్ని దత్తత తీసుకుని బంగారు కొండ కార్యక్రమం ద్వారా వారి ఆరోగ్య పరి రక్షణ అధికారులు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.గురువారం  స్థానిక ఐదు బండ్ల మార్కెట్ సమీపంలో నివాసం ఉంటున్న రేలంగి ఇవాంశిక నివాసానికి వెళ్లి పాప పుట్టినరోజు వేడుకల్లో కలెక్టరు జేసీ తేజ్ భరత్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత పాపాతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బంగారుకొండ కింద నమోదు అయిన అధికారులు వారు దత్తత తీసుకున్న పిల్లలకు చెందిన వేడుకల్లో పాల్గొనడం ద్వారా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు.కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఎన్.తేజ్ భరత్ , ఐ సి డి ఎస్ ఇంఛార్జి పిడి ఎస్. సుభాషిణి , పాప తల్లితండ్రులు, ఐ సి డి ఎస్ సిబ్బంది పాపకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణపతి మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బొండా సిద్ధార్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ, 60వ డివిజన్లలో సోమవారం నిర్వహించిన గణపతి మహోత్సవాల్లో తెలుగుదేశం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *