Breaking News

ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు రేబీస్ టీకాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబీస్ టీకాలు వేయడం జరిగిందని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఎస్.టి.జి. సత్య గోవింద్ పేర్కొన్నారు.సోమవారం స్థానిక జిల్లా పశు వైద్యశాల నందు జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేబీస్ వ్యాధి నివారణ ఉచిత టీకా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ ఎస్.టి.జి. సత్య గోవింద్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువుల నుంచి మనుషులకు సంక్రమిచే జూనోటిక్ వ్యాధుల గురించి రైతులకు , పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పించామన్నారు. పెంపుడు జంతువులు మనుషులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందిస్తాయని, అట్టి జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పెంపుడు జంతువుల యజమానులు సకాలంలో టీకాలు వేయించి వాటిని సంరక్షించు కోవాలని కోరారు . జూనోటిక్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిన ఆవస్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలో 440 పెంపుడు కుక్కలకు రేబీస్ నివారణ టీకాలు వేయటం జరిగిందని, హాజరైన ప్రతికుక్కకు ఉచిత నట్టల నివారణ మందులు, బాహ్య పరాన్న జీవులకు నివారణ మందులు, ఇతర మందులు పంపిణీ చేయటం జరిగిందని అయన అన్నారు.కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఉప సంచాలకులు డాక్టర్ మక్కిన వెంకటేశ్వర్లు, సహాయ సంచాలకులు డాక్టర్ కల్లూరి సత్యనారాయణ, పశువైదులు డాక్టర్ బి. యోగానంద్, డాక్టర్ లోకేష్, ఇతర ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *