విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఆదివారం గుణదల రోటరీ క్లబ్ ఆడిటోరియంలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ శ్రీ దుర్గా నూతన కమిటీ ఎన్నికలో ప్రెసిడెంట్, కె.విక్రంరెడ్డి, సెక్రటరీ టి.నాగేశ్వర్‌లు ఎన్నికైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, ఎన్నిక అధికారిగా జి.మోహన్‌ప్రసాద్ హాజరై ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మోహన్‌ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రోటరీ క్లబ్ 1905లో న్యూయార్క్‌లో ముగ్గురు సభ్యుల చేత స్థాపించబడదని తెలిపారు. అప్పటినుంచి ప్రపంచ దేశాలలో అంచెలంచెలుగా రోటరీ క్లబ్ అభివృద్ధి చెందిందని తెలిపారు. రోటరీ క్లబ్ అభివృద్ధికి భవిష్యత్ కార్యాచరణ విధివిధానాలను వివరించారు. రోటరీ క్లబ్ మెంబర్‌షిప్‌లను 75% పూర్తి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేశారు. అన్నపూర్ణ వృద్ధ ఆశ్రామానికి లాకర్ బాక్సులు అందజేశారు. ప్రెసిడెంట్‌గా కె.విక్రంరెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ అభివృద్ధికి మెంబర్‌షిప్‌లు చేర్పించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. రోటరీ క్లబ్ తరఫున ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఇద్దరు మహిళలు క్లబ్ సభ్యులుగా మెంబర్‌షిప్ తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో హాజరై నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలను తెలియజేశారు
Tags vijayawada
Check Also
కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …