ఎస్సీ. ఎస్టీ మైనారిటీలకు ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమతా సైనిక దళ్ సత్తా చూపుదామని, ఎస్సీ ఎస్టీ మైనారి టీ వారికి ఎక్కడ ఏమి జరిగినా మేము ముందుంటామని, సౌత్ ఇండి యా ఇంచార్జ్ మేకల విజయలక్ష్మి అన్నారు స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమా వేశంలో ఆమె మాట్లాడుతూ, సమతా సైనిక దళ్ ఒక సైనిక దళ్ గా ఒక డ్రెస్ కోడ్ తో ముందుకు వెళుతుందని స్టేట్ డిస్ట్రిక్ట్ మండల టిములు వస్తున్నామని, ఎక్కడ ఏమి జరిగినా మేము ముందుంటామని మా సత్తా చాటుదామని ఆమె తెలిపారు ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా సమత సైనిక దళ్ బలోపేతం చేస్తామని అన్నారు. ప్రస్తుతం పాలిటిక్స్ లో జరిగే అన్యాయాలను అరికడతామని మేము కూడా రానున్న ఎన్నికలలో పోటీ చేస్తామని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ సమతసైనిక దళ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ స్టేట్ డిస్ట్రిక్ట్ మండల్ లలో బలోపేతం చేస్తున్నామని ఎస్సీ. ఎస్టీ మైనారిటీలకు రాష్ట్రంలో ఏ విపత్తులు వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా మేము ముందుం టామని పరిష్కార దిశగా వెళు తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *