రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం అమ్మకాల కౌంటర్లలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిత్యావసర వస్తువుల ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా రైతు బజార్లలో ప్రత్యేక బియ్యం అమ్మకాల కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో శనివారం కృష్ణలంక రైతుబజార్‌లో బియ్యం అమ్మకాల ప్రత్యేక కౌంటర్‌ను జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంపత్‌ కుమార్‌లు ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ డిల్లీరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రెండునెలలుగా బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై అధిక ధరల బారం తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల వారిగా ఇచ్చిన ఆదేశాల మేరకు ముఖ్యంగా బహిరంగ మార్కెట్లలో పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని బియ్యాన్ని ప్రజలకు తక్కువ ధరలలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. దీనిలో భాగంగా నగరంలోని 7 రైతు బజార్లలో సాధారణ, బిపిటి, సూపర్‌ఫైన్‌, సోనామసూరి, స్వర్ణ రకాల బియ్యం అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ద్వారా బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నామన్నారు. కుటుంబానికి 10 కెజిల చొప్పున విక్రయాలు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీటితో పాటు బహిరంగ మార్కెట్లలో 100 రూపాయల ధర ఉన్న టమాటాలను సబ్బిడీ పై రైతు బజార్లలో 50 రూపాయలకే విక్రయిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 200 క్వింటాళ్ల అమ్మకాలు జరిపామన్నారు. కందిపప్పు, ఆయిల్‌ వంటి నిత్యావసర వస్తువులను కూడా తక్కువ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ డా. పి. సంతప్‌ కుమార్‌ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు కార్పొరేట్‌ సామాజిక భాధ్యత (సిఎస్‌ఆర్‌)లో భాగంగా జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ సహకారంతో బియ్యం అమ్మకాలను ప్రారంభించామన్నారు. సోమవారం నుండి హౌల్‌సెల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సహకారంతో కందిపప్పును కూడా విక్రయించనున్నామన్నారు. నగరంలోని ఏడు రైతు బజార్లలో 10 టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు. వ్యాపారస్తులు కృత్తమ కొరతను సృష్టించి నిత్యావసరాల ధరలు పెంచకుండా పౌరసరఫరాల శాఖతో పటిష్ట నిఘాను ఉంచామన్నారు. అక్రమ నిల్వలతో కృత్తిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులు తమ వద్ద ఉన్న సరుకు నిల్వలను ఎప్పటికుప్పడు కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు.
రైతు బజార్లలోని ప్రత్యేక కౌంటర్లలో బియ్యం ధరలు :
సాధారణ రకం రైతు బజార్లలో 30 రూపాయలు – బహిరంగ మార్కెట్లలో 35 రూపాయలు
సూపర్‌ఫైన్‌ రకం రైతు బజార్లలో 32 రూపాయలు – బహిరంగ మార్కెట్లలో 40 రూపాయలు
బిపిటి రకం రైతు బజార్లలో 46 రూపాయలు- బహిరంగ మార్కెట్లలో 52 రూపాయలు
సోనామసూరి రకం రైతు బజార్లలో 49 రూపాయలు -బహిరంగ మార్కెట్లలో 56 రూపాయలు
కృష్ణలంక రైతు బజార్‌లో శానిటేషన్‌ను పరిశీలించిన కలెక్టర్‌ :
రైతుబజార్లలో అమ్మకందారులు, వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. ముఖ్యంగా పురుషులకు, మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉండాలని, ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులకు ర్యాంప్‌ ఏర్పాటు చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, తడి పొడి చెత్తలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. వాహనాలకు ప్రత్యేక పార్కింగ్‌ ఉండాలని కలెక్టర్‌ డిల్లీరావు రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారిని ఆదేశించారు.
కార్యక్రమంలో డిఎస్‌వో మోహన్‌బాబు, మార్కెటింగ్‌ ఏడి. మంగమ్మ, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు పి. శ్రీనివాసరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ రెడ్డి నాయుడు, సివిల్‌ సప్లయిస్‌ డియం వెంకటేశ్వర్లు, ఎఎస్‌వో ధనుంజయరెడ్డి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ జాన్‌ విక్టర్‌, పౌర సరఫరాల శాఖ అధికారులు రామకృష్ణ, కిషోర్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కృష్ణా జిల్లా అభివృద్ధి పనులపై సి ఎం ని కలిసిన ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు అమరావతి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *