రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ఉదయం ఒ ఎన్ జి సి ఆధ్వర్యంలో సి ఎస్ ఆర్ కింద స్థానిక సాయి నగర్, మాధవ్ నగర్ , ద్వారక నగర్ సమీపంలో వున్న పార్క్ అభివృద్ధి కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీ జీ ఎం కేశవ రావు మాట్లాడుతూ, స్వచ్ఛత పక్వాడ లో భాగంగా నగరంలో క్లీన్ అండ్ గ్రీన్ కింద పలు సామాజిక చైతన్య వంతమైన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతొందని అన్నారు. అందులో భాగంగా ఇప్పటికే పుష్కర్ ఘాట్, మార్కండేయ ఘాట్ వద్ద నది జలాల నుంచి ప్లాస్టిక్ ఇతర వ్యర్ధాలను తొలగించడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ తో కలిసి నగరంలో మూడు పార్కులు అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. మొక్కలు ద్వారా ఆక్సిజన్ శాతం అధికంగా రావడం మే కాకుండా ఒక మొక్క వలన 10 మందికి సరిపడే ఆక్సిజన్ ఉత్త్పతి అవుతుందన్నారు. ఒక మొక్క నాటి వాటిని పరిరక్షించాలని పిలుపు నిచ్చారు. వర్షా కాలంలో మొక్కను, కనీసం విత్తనాలు నాటడం ద్వారా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించి తమ వంతుగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు. భవిష్యత్తు తరాల కోసం పెట్టుబడిగా ఈ మొక్కలు ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. మనం నాటే మొక్కల్లో కనీసం 50 శాతం మొక్కలుగా రూపాంతరం చెందితే మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి ఓ ఎన్ జి సి ముందుంటుందని అన్నారు.కాలనీ కి చెందిన శివ కనక ప్రసాద్ మాట్లాడుతూ , ద్వారక నగర్ లే అవుట్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఒ ఎన్ జి సి, మునిసిపల్ కార్పొరేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి కాలనీల్లో మొక్కలు పెంచే కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించి ముందుంటామని హామీ ఇచ్చారు.ఓ ఎన్ జి సి హెచ్ ఆర్ జీ ఎం రావ్ నవీద్ మాట్లాడుతూ, ఈప్రాంతంలో పరిశుభ్రతను పాటించడంలో కాలనీ వాసులు, ప్రజల భాగస్వామ్యం స్ఫూర్తి ని కలుగ చేస్తోందని అన్నారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా మాత్రమే పర్యావరణ పరిరక్షణ, శుభ్రత పాటించడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, ఆర్ ఎం సి సిబ్బంది, ఒ ఎన్ జి సి అధికారులు, సిబ్బంది5, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News