రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నూతన వైద్య కళాశాలలో మెడికోస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యే నాటికి భవననిర్మాణాలతో పాటు వసతి గృహాల్లో అన్ని వసతులు పూర్తి స్థాయిలో కల్పించాలని, ఇందులో ఎటువంటి అలసత్వానికి తావుకు ఆస్కారం ఇవ్వరాదని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆగస్ట్ 10 వ తారీఖు నాటికి ఆయా పనులు పూర్తి చేసి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.మంగళవారం స్థానిక జీజీహెచ్ జిల్లా కలెక్టరు భోదనాస్పత్రి భవన నిర్మాణాలు, మెడికో విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాం, తరగతి గదుల్లో మౌలిక సౌకర్యాలు, ఇతర అంశాలకు సంబందించి ఇంజినీరింగ్ అధికారులు, ఆస్పత్రి వైధ్యాధికారులతో సమావేశ నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టరు కే . మాధవీలత మాట్లాడుతూ వైద్య కళాశాల నిర్మాణాల ప్రగతి, మౌలిక సదుపాయాలు పై వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించి ఆమేరకు పూర్తి చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జీజీహేచ్ వైద్య అధికారులను ఆదేశించారు. నూతన వైద్యకళాశాలలో మొదటి ఏడాది అడ్మిషన్లు ప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో అన్నివసతులతో ఉండే విధంగా క్లాస్ రూమ్ లు సిద్దం చేయాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న మూడు బాలికల వసతి గృహాలను ఆగస్టు 10 వ తేదీనాటికి అన్ని సౌకర్యాలను కల్పించి ఇంఛార్జి లకు అందజేయాలన్నారు. విద్యార్థులు జాయిన్ అయిన ఆయా భవనాల్లో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టరాదని, ముందుగానే పూర్తి చేయాలని కలెక్టరు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బాలికల వసతి గృహాల్లో శానిటేషన్, త్రాగునీరు, మరుగుదొడ్లు, వాషింగ్, లాండ్రీ వ్యవస్థ అందుబాటులో ఉంచాలని మాధవీలత పేర్కొన్నారు. డైనింగ్ , హ్యాండ్ వాష్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పనులు పూర్తయ్యేంత వరకు సంబందిత హాస్టల్ వార్డెన్స్ తరచూ పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి లోపాలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే మెరుగుపర్చే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుం దన్నారు. అదేవిధంగా హాస్టల్ వార్డెన్స్ ముందుగానే హాస్టల్ లో విద్యార్థులకు అందించే ఆహారం, సరఫరా చేసే వ్యవస్థ ప్రభుత్వం నియమ నింభందనల ప్రకారం సిద్దం చేసుకోవాలని అన్నారు. డైనింగ్ హాల్ , త్రాగునీటి వసతి, టాయిలెట్స్ ను పర్యవేక్షించా లన్నారు. ప్రతి వసతి గృహానికి పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే పర్మనెంట్ వార్డెన్స్ నియమించాలన్నారు. అవసరం మేరకు విద్యార్థుల వసతి గృహాల్లో మొదటి నెలరోజుల పాటు నగరపాలక సంస్థ ద్వారా శానిటేషన్ సేవలను అందిస్తామని తెలిపారు. మహిళా మెడికో లకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లడం అత్యంత అవసరం అని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదులను ఆస్కారం లేకుండా చూడాలి అని తెలియ చేశారు. పరస్పరం సమన్వయం తో కలిసి పని చేయడం ముఖ్యం అన్నారు.ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్, నూతన కళాశాల ప్రిన్స్ పాల్ భాద్యతా యుతంగా సేవలందించాలని కలెక్టరు సూచించారు. రెసిడెన్స్ మెడికల్ అధికారి విధులు ఎంతో కీలకం అని పేర్కొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న జి జి హెచ్ సూపరింటెండెంట్ డా ఆర్. రమేష్, ప్రిన్సిపల్ డా బి. సౌభాగ్య లక్ష్మి, సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్. సుబ్రహ్మణ్యం, డి సి హెచ్ ఎస్ డా ఎన్. సనత్ కుమారి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా పి. ప్రియాంక, ఆర్ ఎం వో డా ఎస్కే నసీరుద్దీన్, వివిధ విభాగాల డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.