దేవరపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం దేవరపల్లి మండలం యాదవోలు సచివాలయ పరిధిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంను స్థానిక సర్పంచ్ ఎస్. నాగ వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు.సదరు కార్యక్రమమునకు ముఖ్య అతిధిలుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మ ప్రసాద్ మరియు స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు పాల్గొన్నారు.సంక్షేమం,అభివృద్ధి చిరునామాగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరి పాలన అందిస్తున్నారని, నిస్సహాయులకు అండగా జగనన్న సురక్ష కార్యక్రమం నిలుస్తోందని అన్నారు. గతంలో పింఛన్ కావాలంటే నేతలు చుట్టూ తిరిగే వారన్నారు. మన ప్రభుత్వ హాయాంలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటికే అందజేస్తున్నామని, గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా మీరే గమనించాలి అని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ ఘంటా పద్మ ప్రసాద్ అన్నారు. అర్హులైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.అనంతరం గోపాలపురం గ్రామము లోని ఇందిరమ్మ కాలనీలో జిల్లా పరిషత్ నిధులతో నిర్మించిన నూతన సిసి రోడ్డును స్థానిక శాసన సభ్యులు తలారి వెంకట్రావు తో కలిసి ప్రారంభించారు. తదుపరి అదే కాలనీలో 25 లక్షల వ్యయంతో నిర్మించబోవు సిసి రోడ్డు నిర్మాణ పనులను శంఖుస్తాపన చేసారు.ఈ కార్యక్రమంలో దేవరపల్లి ఎంపిపి కేవికే దుర్గారావు, దేవరపల్లి జెడ్పీ టిసి స్వర్ణలత, నల్లజెర్ల జెడ్పీ టిసి కె.రమేష్, ఎంపిటిసి లు నాగ ప్రసన్న, హరిక జ్యోతి, మండల సచివాలయ కన్వీనర్ సతీష్, సొసైటీ అద్యక్షులు జగదీష్, ఎంపి డివో డి. కృష్ణంరాజు, తహసిల్దార్ రామకృష్ణ, ప్రత్యేక అధికారి రాధాకృష్ణ మరియు ఇతర మండల స్థాయి అధికారులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News