Breaking News

ఇంటింటికీ భవిష్యత్ కు గ్యారెంటీ నమోదు కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
42వ డివిజన్ లోని 38 వ నెంబర్ బూత్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి భవిష్యత్ కు గ్యారెంటీ నమోదు కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య పర్యవేక్షించారు. డివిజన్ పరిధిలో గడపగడపకు వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటూ టిడిపి జనసేన ప్రభుత్వం ఇచ్చే పథకాల గురించి వివరిస్తూ వారి యొక్క వివరాలను  తెలుగుదేశం పార్టీ నాయకులు నమోదు చేసుకున్నారు. ఏదుపాటి రామయ్య మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగలం పేరుతో ప్రజలలోకి వెళ్లి పారుపల్లి జరిగిన ముగింపు కార్యక్రమము లో నారా చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ ఒకే వేదికపై నుంచి ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుకి కోసం ప్రజలకు ఇచ్చే పథకాలను గాని రానున్న రోజుల సంక్షేమ కార్యక్రమాలు గాని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఒక నినాదం మన లోకేష్ యువగళం ప్రజాగళం మై విజయవంతం అయిన సభ గురించి ప్రజలు చర్చించుకుంటున్నారని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడదని ప్రజలు విశ్వసిస్తున్నారు అని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *