Breaking News

ఫుట్ పాత్ పనులు పూర్తి చేయాలి

-గడువులోపు పనులు పూర్తి చేయాలన్న కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంగరంగ వైభవంగా నిర్మాణమవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం ఆదివారం ఉదయం తన పర్యటనలో భాగంగా పరిశీలించిన విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ బందర్ రోడ్డు వైపు ఉన్న ఫుట్పాత్ పనులు త్వరగా పూర్తి చేయాలని. ఒక వారం లో నాణ్యత ప్రమాణాలతో క్వాలిటీలో ఎటువంటి లోపం లేకుండా పనులు త్వరతి గతిన పూర్తి చేయాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్ కి ఆదేశాలు ఇచ్చారు.

విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో నిర్మాణం అవుతున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులు వేగవంతం చేయాలని. జనవరి 20 కల్లా పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటుకు తీసుకురావాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గానున్న పర్యాటకులకు ఆకర్షించే విధంగా ఉండాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులైన వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్స్ చీఫ్ సెక్రటరీ వై శ్రీ లక్ష్మీ సూచనలతో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దగ్గరుండి నాణ్యత ప్రమాణాలలో ఎటువంటి లోపల లేకుండా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మృతి వనం పనులు పరిశీలిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *