Breaking News

శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం రథోత్సవాన్ని ప్రారంభించిన పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహాశివరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీకన్యకాపరమేశ్వరి రధం పై శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల రథోత్సవం కార్యక్రమాన్ని నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో భక్తులు,పోలీస్ అధికారులు తో కలసి రధాన్ని లాగే కార్యక్రమమం లో పాల్గున్నారు. ఈ రథోత్సవం కార్యక్రమం లో పాల్గున్న పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఐ.పి.యస్. మాట్లాడుతూ…వేదమంత్రాలు, మేళతాళాలు, కళానృత్యాలు, కోలాటాల మధ్య భక్త జనసందోహంతో,ఊరేగింపు సందడిగా నేత్రపర్వంగా జరిగిందిని, అందరికి ఆ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివారు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ తో పాటుగా డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., శ్రీనివాసరావు ఐ.పి.ఎస్, కె.చక్రవర్తి, టి.హరికృష్ణ, ఏ.డి.సి.పి.లు టి.నాగరాజు, డి.ప్రసాద్, శ్రీహరిబాబు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది నగర ప్రజలు తదితరులు పాల్గున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *