Breaking News

సాధారణ ఎన్నికల నేపధ్యంలో ఫ్లాగ్ మార్చ్ ను నిర్వహించిన ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్.టి.ఆర్.జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్., ఆదేశాల మేరకు ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలోని ముఖ్య ప్రదేశాలలో డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్.ల పర్యవేక్షణలో సౌత్ ఏ.సి.పి. రత్నరాజు ఆధ్వర్యంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిదిలోని రాణిగారితోట ఏరియాలో, సెంట్రల్ ఏ.సి.పి. ఏ.సి.పి. పి.బాస్కర రావు ఆధ్వర్యంలో పటమట పోలీస్ స్టేషన్ పరిదిలోని పటమట లంక, డొంక రోడ్డు ఏరియాలో, తిరువూరు ఏ.సి.పి. ఎస్.మురళి మోహన్ ఆధ్వర్యంలో రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిదిలో కొత్తనాగులురు గ్రామంలో ఆయా డివిజన్ల ఇన్స్పెక్టర్లు మరియు సుమారు 300 మంది సివిల్,ఏ.ఆర్. పారామిలటరీ బలగాలు మరియు ఏ.పి.ఎస్.పి. పోలీస్ వారితో ఫ్లాగ్ మార్చ్ లను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొనుటకు నిర్భయముగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటారని, ప్రజలు ఎటువంటి అపోహలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *