ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానములో శనివారం శ్రీ స్వామి వారు అమ్మవార్లు రధోత్సవం కొరకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు మరియు పాలకమండలి సభ్యుల వారి సమక్షంలో ఆలయ వైదిక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయము నుండి మేళతాలములతో పల్లకీ పై ఊరేగింపుగా బయలుదేరి కనకదుర్గానగర్ ద్వారా పాత శివాలయం చేరుకొనగా, పాత శివాలయం ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పాత శివాలయం వద్ద పూజలు నిర్వహించి, శ్రీ స్వామి అమ్మవార్లు రధం సెంటరుకు చేరుకొనడం జరిగినది. అనంతరం రధం వద్ద శాస్త్రోక్తముగా పూజలు నిర్వహించి, శ్రీ అమ్మవార్లు స్వామి వారి ఉత్సవమూర్తులకు భక్తి శ్రద్దలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యములు, కళానృత్యాలు, కోలాటాల మధ్య భక్త జనసందోహంతో, ఊరేగింపు సందడిగా నేత్రపర్వంగా రధోత్సవం నిర్వహించడం జరిగినది. అనంతరం ఉత్సవమూర్తులు కెనాల్ రోడ్డు, రధం సెంటర్, కనకదుర్గానగర్ మీదుగా శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయమునకు చేరడం జరిగినది.
ఈ రధోత్సవం కార్యక్రమం నందు నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, IPS , ఆలయ పాలకమండలి సభ్యులు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ, అర్చక సిబ్బంది, పాత శివాలయం కార్యనిర్వాహణాధికారి మరియు సిబ్బంది, కన్యకా పరమేశ్వరి సత్రం సిబ్బంది, ఆలయ అధికారులు, సిబ్బంది, పోలీసు, ట్రాఫిక్ శాఖ సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News