విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేసి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కూటమికి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకువచ్చే బాధ్యత అందరూ తీసుకోవాలని, మీ అందరికి ఏ సహాయ సహకారమైన అందించటానికి సిద్దంగా వున్నానని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కేశినేని శివనాథ్ (చిన్ని) చెప్పారు. శనివారం విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహ్మాద్ ఫతావుల్లా అధ్యక్షతన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ సెల్ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మైనార్టీలకు అండగా వుంటుంది. మైనార్టీల సంక్షేమం, అభివృద్దికై కృషి చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 15 కోట్లతో షాజహూర్ ముసాఫిర్ ఖానా నిర్మాణం , అలాగే కోట్ల రూపాయలతో 98 సెంట్ల స్థలంలో ఉర్దూ కాలేజీ నిర్మాణం తెలుగుదేశం పార్టీ చేపట్టిందని చెప్పారు. తెలుగు దేశం పార్టీ పరిస్థితులకి అనుగుణంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా సంక్షేమం కోసం అని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు ముస్లింల కోసం అనేక కార్యక్రమాలు అనేక పథకాలు చేపట్టారనన్నారు. మరో 50 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుందని, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన మరుక్షణం తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటుంటే వారందరికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించే బ్రహ్మాండమైన పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా, మహ్మాద్ రజావుల్లా, మహ్మాద్ ఇమ్రాన్, షేక్ ఆషా, అబ్దుల్ సత్తార్, జాహేద్, అన్సార్, రియాజ్, కరీముల్లా, సుభానీ, ఫాజుద్దీన్, బడేషా తదితర నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News