ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు

-వృద్ధాశ్రమం లో అవగాహాన కార్యక్రమం
-నోడల్ అధికారి ఎస్. సుభాషిణి

రాజమహేంద్రవరం (రూరల్ ), లాలా చెరువు, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగు శాతం పెరిగేలా తీసుకుంటున్న చర్యలలో భాగంగా వృద్దులు, దివ్యాంగులతో సమావేశాలు నిర్వహించడం జరుగుతోందని స్వీప్ నోడల్ అధికారి, సర్వ శిక్షా అభియాన్ అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త ఎస్. సుభాషిణి తెలిపారు. బుధవారము స్ధానిక లాలా చెరువు గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధాశ్రమం లో వృద్ధులతో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యస్ జ్యోతి తో సమావేశం నిర్వహించి, పండ్లు అందచేశారు.

ఈ సందర్బంగా వృద్దులతో మాట్లాడుతూ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకుని, ఎందరికో ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 85 సంవత్సరాల పైబడిన వృద్దులకు, వికలాంగులకు వారూ నివాసం ఉండే చోట ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్నీ ఎన్నికల సంఘం కల్పించడంపై అవగాహన కల్పించడం జరుగుతోందనీ తెలియ చేశారు. మీకు ఇక్కడ ఓటు లేకుండా వేరే చోట ఉన్నా కూడా ఇక్కడికి ఫారం 8 ద్వారా బదలీ చేసుకునే వెసులుబాటు ఉందని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *